వేములవలస లో ఇళ్ల పట్టాల పై ప్రకంపనలు

7/26/2024 9:26:13 PM

భీమునిపట్నం: ఎక్స్ ప్రెస్ న్యూస్: 
భీమునిపట్నం నియోజవర్గం ఆనందపురం మండలంలోని వేములవలసలో జగనన్న కాలనీ ఇళ్ల పట్టాల విషయంలో అక్రమార్కులకు పెద్దపీట వేశారని ఒక ప్రక్క అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తుంటే మరోపక్క అవన్నీ కేవలం కల్పితాలేనని వైకాపా వారు మొండిగా వ్యవహరించడంతో ఈ విషయం ప్రకంపనలు సృష్టిస్తుంది. వివరాల్లోకి వెళ్తే   వైకాపా ప్రభుత్వం ఏర్పడక ముందు అంటే దాదాపు ఐదేళ్ల కిందట టిడిపి హయాంలో ఈ పంచాయతీలో 470 మంది నిరుపేదలకు ఇల్లు ఇవ్వడానికి నిర్ణయించి జాబితా రూపొందించారు. వారందరూ అసలు సిసలైన లబ్ధిదారులు కాగా ఈ లోపు వైకాపా ప్రభుత్వం ఏర్పడింది. అయితే వారిని కాదని స్థానిక నాయకులు కొత్తగా 100 మందితో జగనన్న ఇళ్ల పట్టాలకు సిఫార్సు చేసినట్లు అభియోగం. అది కూడా ఆదరాబాదరాగా ఎలక్షన్ కోడ్ రాకముందు పట్టాలు ఇప్పించే తతంగం కూడా చేపట్టేసారని ఆరోపణ. అయితే వారిలో ఐదుగురు చనిపోయిన వ్యక్తుల పేరున మరియు దాదాపు చాలా మంది సొంత ఇల్లు ఉన్న వారి కూడా పట్టాలు అందాయని విమర్శలుఉన్నాయి. 101 లేఔట్ సర్వేనెంబర్ 151 లో 89 మందికి పట్టాలు ఇచ్చి మరో 11 బిట్లు స్థానిక నాయకుల చేతిలో పెట్టుకున్నారని అలాగే 37 ప్లాట్ కు సంబంధించి కొట్యాడ స్వాతి అనే ఆమెను బెదిరించి 38 ఫ్లాట్ కలిగిన వ్యక్తి కోరాడ అప్పలస్వామి నాయుడు 140 గజాల స్థలాన్ని ఆక్రమించినట్లు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు అందింది. దీంతో ఆయన తక్షణమే స్పందించి డిప్యూటీ కలెక్టర్ అఖిల తో పాటు బృందం చేత శుక్రవారం ఇక్కడకు వచ్చి పరిశీలన జరిపించారు. ఆక్రమణదారులకు గాని బినామీలకి గాని అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని పూర్తిగా విచారణ జరిపి వారి పట్టాలు రద్దు పరుస్తామని డిప్యూటీ కలెక్టర్ అఖిలపేర్కొన్నారు. ఆమె వెంట స్థానిక ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్, వార్డు సభ్యులు బోద అప్పలరాజు, కోరాడ దామోదర్,  సారిక విజయ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు అట్టాడ బంగారునాయుడు  గ్రామస్తులుతదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా స్థానిక పంచాయతీ ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ వార్డు సభ్యులు మాట్లాడుతూ ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం చేకూర్చాలని జిల్లా కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లకు  విన్న వించుకున్నారు.

Name*
Email*
Comment*