గోపాలపట్నం తాసిల్దార్ విజయభాస్కర్ కు ఘన సత్కారం

7/26/2024 9:29:17 PM

ఎన్ఎడి: ఎక్స్ ప్రెస్ న్యూస్: జూలై 26: 
విధి నిర్వహణ అంకిత భావంతో పనిచేస్తూ బదిలీపై వెళ్తున్న గోపాలపట్నం తాహసిల్దార్ విజయ భాస్కర్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ మేరకు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బదిలీపై విజయనగరం నుంచి  గోపాలపట్నం తాహసిల్దార్ కార్యాలయానికి వచ్చారు. ఎన్నికలు పూర్తయి నూతన ప్రభుత్వ ఏర్పాటయింది. విశాఖ వచ్చిన తాహసిల్దార్ లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఎం .ఎన్ హరేంధిర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ విజయ భాస్కర్ శుక్రవారం బదిలీపై వెళ్లారు. ఆయనను కార్యాలయం సిబ్బంది సచివాలయం సిబ్బంది శాలు వాళ్ళు కప్పి పుష్ప గుచ్చాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఒకవైపు ప్రోటోకాల్ బాధ్యతలు నిర్వహిస్తూ సిబ్బందిని సమన్వయ పరుస్తూ ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించారని సిబ్బంది ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహసిల్దార్ సువర్ణ బాయి,  ఎలక్షన్ డి.టి  శ్రీనివాస్ మండల సర్వేయర్ జగదీశ్వరరావు, రెవిన్యూ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, జూనియర్ సహాయకులు రోహిత్ కుమార్, గ్రేడ్ వన్ వీఆర్వోలు సుబ్రమణ్యం, సాహితీ నవీన్ టైపిస్ట్ వంశీ, సచివాలయ గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*