తహసీల్దార్ కు ఆత్మీయ వీడ్కోలు

7/26/2024 9:35:16 PM

పాతపట్నం: ఎక్స్ ప్రెస్ న్యూస్: జూలై 26.
పాతపట్నం మండలం స్థానిక తహసీల్దార్ వైయస్ వివి ప్రసాదరావు కు రెవెన్యూ అధికారులు,సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన విశాఖ జిల్లా నుంచి ఎన్నికల నేపథ్యంలో పాతపట్నంకు బదిలీ వచ్చారు. ఎన్నికలు పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తోలి ఎక్కడ పనిచేసారో  అక్కడికే పోస్టింగులు ఇస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన విశాఖ జిల్లాకు బదిలీపై వెళుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పాతపట్నం తన కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు.ఆయనకు ఘనంగా సిబ్బంది వీడ్కోలు పలికారు.

Name*
Email*
Comment*