వెనుకబడిన విద్యార్థులను తెలివైన విద్యార్థులు అభివృద్ధి చేయాలి

7/26/2024 9:45:44 PM

రణస్థలం: ఎక్స్ ప్రెస్ న్యూస్:
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అదపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి డాక్టర్ బాకూరి వాసుదేవరావు అదపాక ఉన్నత పాఠశాల ను సందర్శించి 10వ తరగతి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను పదో తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించానని ఆంధ్ర యూనివర్సిటీలో ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, బెంగుళూరులో రీసెర్చ్ (పిహెచ్డి) చేసి ప్రస్తుతం బెల్జియంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డాక్టరేట్ చేస్తున్నానని తెలిపారు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తి ని ఆచరిస్తూ విద్యార్థులు కష్టపడి విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. తెలివైన విద్యార్థులు వెనుకబడిన విద్యార్థులకు విద్యా విషయంలో  అభివృద్ధిలో సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో ఇంచార్జ్ హెడ్మాస్టర్ గురుగుపల్లి బాలకృష్ణ, స్టాఫ్ సెక్రటరీ బి ఉదయ్ కుమార్ జన విజ్ఞాన వేదిక విద్యా విభాగం రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్  మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని దానిని నిరూపించిన వాసుదేవరావును అభినందించారు. కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు బొడ్డేపల్లి జగన్నాథరావు ఏ వాసుదేవరావు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ఎన్ కృష్ణారావు, పి. లక్ష్మణరావు జి రుద్ర ప్రతాప్ ,ఏంవి కామేశ్వర్, ఎన్.వి రమణ, ఎస్. దాలయ్య ,పి. రామస్వామి, ఎస్. రాజేశ్వరి, ఈ. ఉమారాణి, మంజు భార్గవి, జి. గోపాలరావు, బిఏ నరసింహులు, జి. నరేంద్ర తదితరులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థిని విద్యార్థులు క్రాఫ్ట్ టీచర్ మంజు భార్గవి ఆధ్వర్యంలో కాగితము మట్టి తో లోకాస్ట్ మెటీరియల్ తో పలు రకాలైన బొమ్మలు మరియు వస్తువులు తయారుచేసి ప్రదర్శించారు. పిల్లలకు బహుమతులను అందజేయడం జరిగింది.

Name*
Email*
Comment*