వేట నిషేధ పరిహారం అందరికీ ఇవ్వాలి!

7/26/2024 10:03:54 PM

- ఆలస్యంపై మత్స్యకారులు అసంతృప్తి

సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: 
వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఇప్పటిదాకా ఇస్తున్న పదివేల భృతిని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు  రూ 20000 పెంచుతున్నట్లు మత్స్యకారులకు హామీ ఇచ్చారు. ఈ హామీ నేపథ్యంలో ఇప్పటిదాకా మత్స్యకార భరోసా లబ్ధిదారుల ఖాతాల్లో పడలేదు. జిల్లావ్యాప్తంగా  ఉన్న 4000 బోట్లు కు సంబంధించి 15,200 మంది అసలైన లబ్ధిదారులను  మత్సశాఖ అధికారులు సుధీర్ఘ ఎక్సర్ సైజ్ చేసి  జాబితా సిధ్దం చేశారు. నిజమైన వేటగాళ్లకు ఈ భరోసా  ఇవ్వాలని ఆలోచనతో అటు అధికారులు ,పాలకులు ఉన్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి సముద్రంలో వేటను నమ్ముకుని బతుకుతున్న మత్స్యకారులు మాత్రమే నిషేధకాలంలో అందించే భృతిని అందజేయాల్సి ఉంది . వీరికే కాక ఇతర సామాజిక వర్గాలు ,పార్టీ కార్యకర్తలు ,స్థానికేతరులు ,సముద్రంలో ఈత రానివారికి కూడా అందించారనే ఆరోపణలు ఉన్నాయి .అంతే కాక ఇతరత్రా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకున్న వారు ఎవరైనా ఇందులో ఉంటే వారికి  భరోసా వర్తింప చేయకూడదన్న నిబంధన ప్రభుత్వం విధించింది. దీంతో చాలా మంది ఈ భరోసా కు దూరమవుతున్నారని వారంతా ఆవేదన చెబుతున్నారు. పెంచిన పదివేల రూపాయలు కాకుండా ఇదివరకే ఉన్న పదివేల రూపాయలు అందరికీ వర్తించేలా నిబంధనలు సడించాలని మత్యకారులు కోరుతున్నారు.  జూన్ నెలలో అందాల్సిన వేట నిషేధ భృతి నేటి వరకు అందలేదని పలువురు మత్స్యకారులు నుంచి ఆవేదన వ్యక్తం ఔతోంది.ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఈ భృతిని ఈ ఏడాది నుంచే లబ్ధిదారులకు 20 వేల రూపాయలు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉండటంవల్ల ఇప్పటిదాకా వారి ఖాతాల్లో ఈ సొమ్ము జమ కావడం లేదు. ప్రతీఏటా ఏప్రిల్ 16 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేటనిషేధం అమలవుతోంది. ఈ రెండు నెలలు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు గత ప్రభుత్వం రూ 10000 పరిహారం అందించింది. దీనికి మరో 10,000 కలిపి 20000 ఇచ్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు సర్వత్రా చర్చ జరుగుతోంది.  ఈ ప్రక్రియ ఆలస్యం కావడానికి ఇదో కారణం అని తెలుస్తోంది. ఇదే సమయంలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన మత్స్యకారులు వేటలేక ఇబ్బందులు పడుతున్నారని అధికారులు వెంటనే స్పందించి ఆంక్షలు సడలించి ,మత్స్యకారులు పింఛన్లు , రైతు భరోసాలు ఇతరత్రా సంక్షేమ పథకాలు దృష్టిలో పెట్టుకోకుండా అందరికీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు మక్తకంఠంతో కోరుతున్నారు.దీనిపై స్థానిక మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించి గతంలో ఉన్న నిబంధనలు సడలించి అందరికీ భరోసా కల్పించాలని జిల్లా మత్స్యకారులు కోరుతున్నారు.

Name*
Email*
Comment*