తహసీల్దార్ కు బదిలీ సన్మానం

7/26/2024 10:06:49 PM

సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: 
ఎన్నికల ముందు సోంపేట తహశీల్దారుగా బాధ్యతలు స్వీకరించి నాలుగు నెలల పాటు సమర్థవంతంగా విధులు నిర్వహించిన కె విజయ్ కుమార్ అనకాపల్లి బదిలీ కావడంతో శుక్రవారం సాయంత్రం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లు ,రెవిన్యూ సిబ్బంది ఘనంగా సన్మానించి ఆయన సేవలు కొనియాడారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోంపేటలో కొద్ది నెలల పని చేసినప్పటికీ ఈ ప్రాంతీయులు అందించిన ఆదరాభిమానాలు ఆనందం కలిగించాయని పేర్కొన్నారు.  నాలుగు నెలల పాటు ఆదరించిన సోంపేట ప్రజలు, వివిధ పార్టీల నాయకులకు ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీసల్దార్ ప్రేమ్ కుమార్ డీలర్ల సంఘం అధ్యక్షులు సానా షన్ముఖరావు , మల్లా కృష్ణారావు, కొర్లాం రాజేష్ రాఘవదాసు ,విఆర్వోలు సర్వేయర్లు, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Name*
Email*
Comment*