ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి !

7/26/2024 10:08:30 PM

- ఏపిటియఫ్ రాష్ట్ర కౌన్సిలర్ బి.సుభాష్ బాబు.

సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: 
సుదీర్ఘకాలంగా  పెండింగ్ లో ఉన్న, అన్ని యాజమాన్యాల పరిధిలో పనిచేస్తున్న  ఉపాధ్యాయుల సమస్యలను  ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని ఏ.పీ.టీ.యఫ్ రాష్ట్ర కౌన్సిలర్ బి.సుభాష్ బాబు అన్నారు.  శుక్రవారం, ఏ.పీ.టీ.యఫ్  మందస మండల శాఖ ఆధ్వర్యంలో ఉద్దానం ప్రాంతంలోని హరిపురం, అంబుగాం,నారాయణపురం, బహడపల్లి, భేతాళపురం, లోహరిబంద పాఠశాలలను సందర్శించి ఆయా ఉపాధ్యాయులు సమస్యల్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన  మాట్లాడుతూ  ప్రభుత్వం 117 జీ. ఓ రద్దుకు చర్యలు  వేగవంతం చేయాలని, పెండింగులో ఉన్న పీ ఆర్ సీ ని వెంటనే  అమలు చేయాలన్నారు. అంతవరకు మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు . కేజీబీవి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కు కనీస టైం స్కేల్ అమలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. గిరిజన సంక్షేమ పాఠశాల సమస్యలైన రెగ్యులర్  వార్డెన్, ఏఎన్ఎం పోస్టుల భర్తీ, అప్గ్రేడ్ అయిన భాష పండితుల జీతాలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీటీయఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు గవ్వ. భీమారావు, మందస మండల ఏపీటీయఫ్  అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లు యస్.కిరణ్ కుమార్, కె.సుందర రావు , ఇతర కార్యవర్గ సభ్యులు యన్. ఢిల్లీశ్వర రావు, డి.చంద్ర శేఖర్, కె. ధనరాజు  యస్.ప్రసాదరావు, వైకుంఠ బెహరా తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*