జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల గడువు ఆగస్టు 31 వరకు పొడిగింపు

7/26/2024 10:20:06 PM

- ఏపి ఎస్సి పిసిఆర్ సభ్యులు గొండు సీతారాం

శ్రీకాకుళం: ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న 5-18 ఏళ్లు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ సారధ్యాన రాష్ట్రపతి చేతుల మీదుగా వచ్చే ఏడాది జనవరి 26 న జాతీయ ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ్ బాల్ పురస్కారాలను ప్రధానం చేసేందుకు దరఖాస్తులను జూలై 31 చివరి రోజుగా ప్రభుత్వం గడువు విధించింది.   ఈ గడువు పెంపు చేయాల్సిందిగా దేశ వ్యాప్తంగా అందిన విజ్ఞప్తులను పరిశీలనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు కల్పించిందని అన్నారు. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, ధైర్య సాహసాలు, పర్యావరణం, క్రీడలు, కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యం,పెయింటింగ్, నూతన ఆవిష్కరణలు,  నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు మొదలైన వాటిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను కనపరుస్తున్న భారత దేశ సంతతికి చెందిన బాలలు ఈ వెబ్సైట్, http/awards.gov.in ద్వారా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకునేందుకు విరివిగా బాలలకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టేలా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అన్ని జిల్లాల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేసినట్టు సీతారాం తెలిపారు.

Name*
Email*
Comment*