రాజీవ్ గాంధీ యూనివర్సిటీ లో ప్రారంభించిన కౌన్సిలింగ్ ప్రక్రియ

7/26/2024 10:24:32 PM

ఎచ్చెర్ల, ఎక్స్ ప్రెస్ న్యూస్: 
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ఐఐఐటిలో  ప్రవేశానికి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నుండి విద్యార్థులు, తల్లిదండ్రులకు అన్ని రకాలుగా సదుపాయాలును కల్పించారు. ముందస్తు ఏర్పాటులో  బాగంగా  విద్యార్థులుకు  టోకెన్ ఇచ్చి కౌన్సిలింగ్ కేంద్రానికి అనుమతించారు. కుల ద్రువీకరణ పరిశీలన, అకడెమిక్ ద్రువ పత్రాలు తనకి, ఫీజు చెల్లించడం  సమచారం ఆన్లైన్ లో పొంధు పరచడం సర్టిఫికెట్స్ సేకరణ చేసి విద్యార్థులు ప్రవేశము కల్పించారు. ఆర్.జి యుకేటి అడ్మిషన్స్ కన్వీనర్ డాక్టర్ అమరేంద్ర కుమార్, డైరెక్టర్ ఆచార్య బాలాజీ, పరిపాలన అధికారి ముని రామ కృష్ణ, డీన్  మోహన్ కృష్ణ చౌదరి, కోఆర్డినేటర్  గోవర్థనరావు, కోకోఆర్డినేటర్  రమణ, పిఆర్ఓ షణ్ముఖ తదితరులు ప్రవేశములు  పొందిన  విద్యార్థులుకు  ద్రువీకరణ పత్రాలు అందజేశారు. కౌన్సిలింగ్   ప్రక్రియకి  100 స్టాల్స్ ను యేర్పాటు చేశారు. కౌన్సిలింగ్ కన్వినర్ అమరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఐఐఐటి లో  ప్రవేశమునకు  ఈ నెల 22 న  కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని, ఆ ప్రక్రియ  రేపటితో ముగుస్తుందన్నారు. నాలుగు ఐఐఐటి  మిగులు  సీట్స్  వివరాలు  రేపు  సాయంత్రం వెల్లడిస్తామన్నారు. మిగులు  సీట్లను మెరిట్ ప్రకారం ఆగస్టు మొదటి వారంలో రెండో విడత కౌన్సిలింగ్ లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఐఐఐటిలో  మొదటి ర్యాంక్ లు సాధించిన విద్యార్థినీ విద్యార్థులు  ఎస్. విద్యశ్రీ, ఎల్.భావన ఎస్. మానస, జి.షణ్ముకేశ్వర్, డి రాకేష్. ఈ కార్యక్రమంలో ఆర్జియుకేటి అధికారులు, సహయ ఉద్యోగులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*