మైనర్లు డ్రైవింగ్ తో పెరుగుతున్న ప్రమాదాలు

7/26/2024 10:27:57 PM

శ్రీకాకుళం: ఎక్స్ ప్రెస్ న్యూస్: 
పట్టణంలో రోజు రోజుకి ద్విచక్ర వాహనాల ప్రమాదాలు పెరుగుతున్నాయి. పట్నంలో చదువుతున్న విద్యార్థులు ఎక్కువగా మైనర్ లో ఉండడం వారు ద్విచక్రవాహన నడపడం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతుంది. బుధవారం కాలేజీ రోడ్లో మైనర్లు డ్రైవింగ్ తో ఓ విద్యార్థి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ చేరి కోమాలోకి వెళ్లే పరిస్థితి వచ్చింది. దీనిని పరిగణలో తీసుకొని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కళాశాలల యాజమాన్యాలకి, చదువుతున్న విద్యార్థులకు  రెండో పట్టణ ఎస్సై హరికృష్ణ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. భవిష్యత్తులో ఇటువంటి తప్పిదాలు జరక్కుండా అటు తల్లిదండ్రుల పాటు కళాశాల లు యాజమాన్యాల కూడా బాధ్యత వహించాలని తెలిపారు కళాశాలలకు హాజరైన,విద్యార్థులు బయటికి వెళ్లకుండా కళాశాలల సమయంలో రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని దానికి బాధ్యత కూడా  యాజమాన్యంపై ఉంటుందని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లో తీసుకున్న తర్వాత మాత్రమే వాహనాలు నడపాలని అలా కానీ ఎడల  చట్టపరమైనచర్యలు తీవ్రంగా ఉంటాయని, అందువల్ల తల్లిదండ్రులు యాజమాన్యాలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు అంతేకాకుండా పట్టణంలో విచ్చల విడిగా యువత మాదక ద్రవ్యాలకు బానిసవ్వడంతో ఇటువంటి ప్రమాదాలకు కూడా కారణం అవుతాయని అందువల్ల మాదక ద్రవ్యాలు నియంత్రణకు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Name*
Email*
Comment*