మీడియా రిలేషన్స్ డీన్ గా ఆచార్య చల్లా రామకృష్ణ

7/26/2024 10:36:34 PM

విశాఖపట్నం: ఎక్స్ ప్రెస్ న్యూస్:  
ఆంధ్రవిశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం ఆచార్యులు ఆచార్య చల్లా రామకృష్ణ ప్రెస్, మీడియా రిలేషన్స్ విభాగం డీన్గా నియమితులయ్యారు. శుక్రవారం ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.కిషోర్ బాబు నుంచి ఉత్తర్వులను స్వీకరించారు. అనంతరం ఆచార్య చల్లా రామకృష్ణను వీసీ ఆచార్య జి. శశిభూషణ రావు అభినందించారు. ఆచార్య చల్లా రామకృష్ణ పర్యవేక్షణలో ఇప్పటి వరకు 23 మంది డాక్టరేట్లు అందుకున్నారు. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, స్వీడన్, డెన్మార్క్ దేశాలలో అంతర్జాతీయ సదస్సులలో ఆయన ప్రసంగాలు చేశారు. అమెరికాలోని యూనివర్సిటీలలో జర్నలిజం ప్రసంగాలు చేసారు. అసోసియేషన్ ఆఫ్ కామన్వెల్త్ యూనివర్సిటీస్ పిఆర్ నెట్వర్క్ సభ్యునిగా, అమెరికాలోని సొసైటీ ఫర్ ప్రొఫిషనల్ జర్నలిస్ట్స్ సభ్యునిగా, విజెఎఫ్ వ్యవస్థాపకునిగా ఆయన జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖ ప్రాంతీయ కేంద్రం చైర్మన్ గా, కార్యదర్శిగా ఆయన పనిచేసారు. ఏయూ వ్యవస్థాపక పి.ఆర్.ఓ గా సుదీర్ఘ కాలం విశిష్ట సేవలు అందించారు. జర్నలిజం విభాగం ఆచార్యునిగా, విభాగాధిపతిగా, బిఓఎస్ చైర్మన్, ఏయూ రీసెర్చ్ ఫోరం కన్వీనర్గా, ఆర్ట్స్ కళాశాల అసిస్టెంట్ ప్రిన్సిపాల్గా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జీవిత కాల సభ్యునిగా విభిన్న పదవీ బాధ్యతలను నిర్వహించారు. జర్నలిజం రంగంలో 14 పుస్తకాలను రచించారు. అంతర్జాతీయ, జాతీయ జర్నల్స్లో పలు పరిశోధన పత్రాలను ప్రచురించారు. ఆచార్య చల్లా రామకృష్ణ అసోసియేషన్ ఆఫ్ కామన్వెల్త్ యూనివర్సిటీస్ నుంచి బెస్ట్ పి.ఆర్ అవార్డును కెనడాలో స్వీకరించారు. భారత మాజీప్రధాని పి.వి నరసింహా రావు, భారత రత్న మదర్ థెరీసాలను గతంలో ఆచార్య చల్లా రామకృష్ణ ఇంట్వ్యూ చేసారు.

Name*
Email*
Comment*