కొనుగోలు దారునికి అందుబాటులో ఇసుక ధర

7/26/2024 10:45:40 PM

*భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లకు ఆదేశం

శ్రీకాకుళం: ఎక్స్ ప్రెస్ న్యూస్; 
కొనుగోలు దారునికి ఇసుక రేటు అందుబాటులో ఉంటుందని భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో ఇసుకపై ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో శుక్రవారం ఆయన మాట్లాడారు.  ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పారు. రవాణా చార్జీలు మాత్రమే లబ్ధి దారుల నుండి వసూలు చేయాలని వెల్లడించారు. ఇసుక నిల్వ పాయింట్ల వద్ద రవాణా చార్జీలను శాశ్వతంగా డిసిప్లే చేయాలన్నారు.   డీ సిల్టేషన్ ను వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ చూడాలన్నారు. ఇసుక రీచ్ ల వద్ద ట్రక్కులను అందుబాటులో ఉంచాలని చెప్పారు. రవాణా ఛార్జీలు ప్రజలకు అందుబాటులో రీజనబుల్ రేటు ఉండాలన్నారు. రవాణా ఛార్జీలను జిల్లా స్థాయి కమిటీ నిర్ణయించాలని చెప్పారు. స్టాక్ పాయింట్ల వద్ద సిసి కెమేరాలు ఏర్పాటు చేయాలన్నారు. 
     భూగర్భ గనుల శాఖ కమీషనర్ ప్రవీణ్ కుమార్ జిల్లాల వారీగా ఇసుక నిల్వ, వార్షిక డిమాండ్ యొక్క కార్యాచరణ ప్రణాళిక, రీచ్ ల గుర్తింపు, రవాణా చార్జీలు, డీ సిల్టేషన్, తదితర వాటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 
     జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ స్టాక్ యార్డ్ లో ప్రస్తుతం 46 వేల టన్నుల ఇసుక నిల్వ ఉందని, డీ సిల్టింగ్ త్వరలోనే చేస్తామన్నారు. రవాణా చార్జీలు తీసుకుంటున్నట్లు వివరించారు. డీ సిల్టేషన్ పాయింట్ల వద్ద 15 రోజుల్లో ప్రారంభించాలని కమీషనర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. 
     జిల్లా నుండి జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డిటిసి చంద్ర శేఖర్ రెడ్డి, ఎస్ఈబి అదనపు ఎస్పీ గంగాధరం, మైన్స్ ఎడి ఫణి భూషణ్ రెడ్డి, ఉప కలెక్టర్ ఇన్ చార్జ్ శ్రీకాకుళం ఆర్డీఓ అప్పారావు, ఉప కలెక్టర్ సుదర్శన్ దొర, విజిలెన్స్ స్క్వేడ్ కె. వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*