పరిశ్రమల అధికారులతో సమీక్ష

7/26/2024 10:50:21 PM

*జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీకాకుళం, ఎక్స్ ప్రెస్ న్యూస్: 
జిల్లాలోని ఏ ఏ ప్రాంతాల్లో ఏ పరిశ్రమలు ఉన్నదీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆరా తీశారు.  జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ పై సంబంధిత అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షించారు. జిల్లాలో ఎంఎస్ఎంఈ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల గూర్చి ఎడి రమణారావు వివరించారు. చిన్న, భారీ పరిశ్రమల గూర్చి ఆయన ఆరా తీశారు.  జిల్లాలో ఉన్న పరిశ్రమలు ఏ ఏ పరిశ్రమల్లో తయారీ వివరాలు, వాటి ఉత్పత్తులు, తదితర వాటి గూర్చి వివరాలను పరిశ్రమల అధికారులను అడిగి తెలుసుకున్నారు. కెమికల్ పరిశ్రమలు, పైడిభీమవరంలో ఏ ఏ పరిశ్రమలు ఉన్నాయని, వాటి ఉత్పత్తులు, ఏ ఏ మందులు తయారు చేస్తున్నదీ, అక్కడ కల్పించే ఉపాధి అవకాశాలు పై ఆయన ఆరా తీశారు. ఎపిఐఐసి ద్వారా ఇచ్చే భూ వివరాలపై ఆయన తెలుసుకున్నారు. ఎంఎస్ఎంఈ ద్వారా ఏర్పాటు చేసిన పరిశ్రమల గూర్చి వివరించారు.  ఏజన్సీ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు గూర్చి అడుగగా మందస ప్రాంతంలో జీడి ఫ్యాక్టరీ ఉన్నట్లు చెప్పారు.   ఎపిఐఐసి జిఎం పాండు రంగారావు ఎపిఐఐసి ద్వారా ఏర్పాటు చేసిన పరిశ్రమల పై వివరించారు. దరఖాస్తు చేయు విధానం, అనుమతులు ఏ విధంగా జారీ చేస్తున్నారో ఆయన అడిగి తెలుసుకున్నారు. ఋణాలు ఏ విధంగా ఇస్తారని ఆయన అడుగగా ఋణాలు మంజూరు చేసే విధానంపై ఎల్డీయం సూర్యకిరణ్ వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై తెలియజేయాలని ఆయన అడుగగా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న వెంటనే బ్యాంకుకు పంపిస్తామని, అక్కడ నుండి బ్యాంకు వారు సబ్సిడీ, మహిళలకు ఇచ్చే సబ్సిడీ, మార్జిన్ మనీ పైన తెలిపారు. విద్యుత్ ఇస్తున్న సబ్సిడీ పైన వివరించారు. 
డిఐపిసిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల గూర్చి ఆయన అడుగగా 41 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు చెప్పారు. రిజెక్షన్స్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఏ ఏ శాఖలో పెండింగులో ఉన్నది ఆయన ఆరా తీశారు. సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని ఆయన అడుగగా ఎపిఐఐసిలో ఉన్న సమస్యలపై డిజడ్ఎం పాండురంగారావు వివరించారు.  రాష్ట్రం నుండి సబ్సిడీ ద్వారా ఇచ్చే పథకాల గూర్చి మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే సబ్సిడీలపై తెలిపారు. మత్య్స శాఖ ద్వారా ఇచ్చే పథకాలుపైన ఆయన ఆరా తీశారు. కోల్డు స్టోరేజ్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని ఆయన అడుగగా చేపలు నిల్వ చేసే స్టోరేజీలు లేవని ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయన్నారు.  పిఎం విశ్వకర్మ పథకం గూర్చి ఆయనకు వివరించారు.  ఇందులో 7138 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు.  ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి జె. ఉమామహేశ్వరరావు, ఎడిలు రమణారావు, రఘునాథ్,  ఎల్డీయం సూర్యకిరణ్, ఎపిఎంఐపి డిడి శ్రీనివాసరావు, ఎపిఐఐసి డిజడ్ఎం పాండు రంగారావు, ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*