కార్గిల్ అమర వీరుల త్యాగాలు నేటి యువతకు ఆదర్శం కావాలి

7/26/2024 10:51:48 PM

 *జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారిణి శైలజ

శ్రీకాకుళం, ఎక్స్ ప్రెస్ న్యూస్ ;
భరతజాతి చరిత్ర పుటల్లో  సువరణాక్షరాలతో నిలిచిన కార్గిల్ యుద్ద విజయాన్ని .. మువ్వన్నెల జెండా  తరహాలో విజయగర్వంతో జరుపుకొనే పండుగ ఈ విజయ దివాస్ అని శ్రీకాకుళం జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారిణి ఎం. శైలజ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మాజీ సైనికుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన సిభిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించే పవిత్రమైన రోజు అని అన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా మాజీ సైనికులు అంతా కలిసి కట్టుగా ముందుకు వచ్చి మెగా రక్త దానం చేయటం నిజమైన నివాళి అని కొనియాడారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులు అంతా దేశ చరిత్ర పుటల్లో వీరులుగా నిలిచిపోతారని అన్నారు. కార్గిల్ అమర వీరుల త్యాగాలు నేటి తరం యువతకు ఆదర్శం కావాలి అని అన్నారు.  శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్. డోల జగన్మోహన్ మాట్లాడుతూ జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చిన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహుదూర్ శాస్త్రి ఆలోచన విధానం ఆయన సైనికులకు రైతులకు ఇచ్చిన ప్రాధాన్యత నేటి తరం యువతకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. 
ఈ కార్యక్రమంలో  శాసన సభ్యులు టిడిపి నేతలు కూన రవి సతీమణి ప్రమీల గొండు శంకర్ సతీమణి స్వాతి ఎన్. ఈశ్వర రావు తనయుడు తేజబాబు మాజీ సైనికుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు పైడి రామారావు డి. సాంబశివరావు ఎస్. నారాయణమూర్తి కలివరపు సాయిరాం ఎం. శంకర్నారాయణ, ఎన్సీ సీ అధికారి డాక్టర్ వై. పోలినాయుడు, చౌదరి అన్నాజీ, పైడి మధు సూధన రావు, సువ్వారి నీలాచలం తదితరులు పాల్గొన్నారు.. విశాఖపట్నం జిల్లా నుండి వొచ్చిన. జె వై అకాడమీ విద్యార్థులు సుమారు 45 మంది రక్తదానం చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుండి వందలాది మంది మాజీ సైనికులు తండోప తండాలుగా తరలివచ్చి రక్తదానం చేసి వీర సైనికులకు నిజమైన నివాళులు అర్పించారు.

Name*
Email*
Comment*