పండగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ

8/1/2024 11:12:01 PM

*ఉదయం ఏడు గంటలకే 89 శాతం పంపిణీ రికార్డ్

*వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు

టెక్కలి, ఎక్స్ ప్రెస్ న్యూస్: 
టెక్కలి రూపురేఖలు మార్పు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి డివిజన్ కేంద్రంలో  కండ్రక వీధిలో ఏర్పాటు చేసిన ఎన్ టి ఆర్ బరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం లో కలెక్టర్ స్వప్న ఎల్ దినకర్ పుడ్కర్ తో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో నిరుపేదలకు పింఛన్లు పంపిణీ చేసే ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు కు దక్కుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక జాతర ను తలపించే రీతిలో పింఛన్లు పండగ జరిగిందని. ఉదయం ఏడు గంటలకు శ్రీకాకుళం జిల్లాలో 89 శాతం పింఛన్లు పంపిణీ చేసి రికార్డ్ సృష్టించామని అన్నారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని కండ్రక వీధి అభివృద్ధికి బాటలు వేస్తామని.. ఒక మోడల్ వీదిగా తయారుచేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో దారుణంగా ఉందని, అయినా ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాలు అన్నీ విడతలవారీగా అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో నేడు 64 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని. త్వరలో అర్హులైన వారిని గుర్తించి కొత్త పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుదలకు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తున్నామని.. ఈ నెల ఏడవ తేదీన జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం లో మత్స్యకారులు ఆందోళన చెందుతున్న 217 జీఓ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అంతక ముందు కంద్రక వీధి పాదయాత్ర ద్వారా  పరిశీలించారు. అనంతరం టెక్కలి ప్రాంతీయ ఆస్పత్రి సమీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుడ్కర్  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*