పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకోవా లి

8/1/2024 11:16:38 PM

*ఆదేశించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీకాకుళం: ఎక్స్ ప్రెస్ న్యూస్: 
పర్యాటకాభివృద్దికి చర్యలు తీసుకోవాలని పర్యాటక అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు.   కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పర్యాటక మండలి సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలసి ఆయన సమీక్షించారు. శాలిహుండం మాన్యుమెంట్ కోసం వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీముఖలింగం టెంపుల్ గూర్చి ఎవరెవరు ఏమి చేస్తారో అడుగగా పర్యాటక ఆర్డీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందని వారితో సమన్వయంతో అభివృద్ధి చేస్తామన్నారు. అరసవల్లి అభివృద్ధికి సంబంధించి జిల్లా నుండి కేంద్రానికి ప్రతిపాదనలు పంపడమైనదని, ఎక్కడ పెండింగ్ లో ఉందని ఆయన అడుగగా కేంద్ర పర్యాటక శాఖ వద్ద పెండింగ్ లో ఉందని ఆర్డీ వివరించారు. శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి దేవాదాయ శాఖ 4 కోట్ల రూపాయలు మంజూరు చేయగా టెండర్లు పూర్తి అయినట్లు అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్ చెప్పారు. శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయంనకు రహదారి, పార్కింగ్ ఉన్నాయా లేదా కలెక్టర్ అడుగగా ఉన్నట్లు అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. వజ్రపుకొత్తూరు వద్ద టూరిజం ప్రాజెక్టు ఏర్పాటుకు భూ సమస్య ఉండగా సంబంధిత రైతులతో చర్చించి ప్రాజెక్టు వస్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలియజేయాలని పలాస ఆర్డీఓను ఆదేశించారు. అమృత పార్క్ అభివృద్ధి చేసి థర్డ్ పార్టీ కి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాలిహుండం వద్ద నిర్మించిన పర్యాటక భవనాలు గూర్చి ఆర్డీ వివరించారు. గొట్టాబ్యారేజ్ వద్ద బోటింగ్ ఏర్పాటుకు పాయింట్ గుర్తించిట్లు నారాయణరావు చెప్పారు. భూమిని కూడా గుర్తించినట్లు చెప్పగా అవసరమైన భూమి చూడాలని జలవనరుల శాఖ ఎస్ఈ కి కలెక్టర్ ఆదేశించారు. భావన పాడు వద్ద పర్యాటక అభివృద్ధికి కావలసిన భూమి ఇస్తామని కలెక్టర్ చెప్పారు. ఇప్పిలి వద్ద పర్యాటక అభివృద్ధికి అక్కడ భూ సమస్యకు సంబంధించి జాయింట్ సర్వే చేయాలని కలెక్టర్ ఆర్డీఓను ఆదేశించారు. పలు పర్యాటక ప్రాజెక్టులు గూర్చి చర్చించారు. ఎఎస్ఐలో ఉన్న డచ్ బిల్డింగ్ గూర్చి ఇంటాక్ నుండి రాధాకృష్ణ కలెక్టర్ కు వివరించగా కలెక్టర్ ఆర్కియాలజి డిపార్ట్మెంట్ ను అడుగగా రిన్నోవేషన్ చేయాలని, అక్కడ ఏమీ చేయకూడదని టెక్నీషియన్ శ్రీనివాసరావు కలెక్టర్ కు వివరించారు. అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని, అక్కడ ఏమి చేయవచ్చో చెప్పాలన్నారు.  ట్రావెల్ ఏజంట్ల అభిప్రాయాలను ఆయన తెలుసుకున్నారు. శాంతినగర్ కాలనీ పార్క్ మెంటెనెన్స్ చేయాలన్నారు. లైటింగ్ పెంచాలని ఆదేశించారు. పార్క్ ఎక్సెటెన్ష్ చేయాలన్నారు. విజయానంద్ పార్క్, తదితర వాటిపై చర్చించారు. జిల్లాలో టెంపుల్ టూరిజంపై హోటళ్లు యజమానులు కలెక్టర్ కు వివరించారు. ఇతర రాష్ట్రాల పర్యాటకులు జిల్లా పర్యాటకాన్ని సందర్శిస్తే ఆయా రాష్ట్రాలకు సంబంధించి భోజనాలు అందుబాటులో హోటళ్లలో ఉండాలని ఆయన చెప్పారు.  టెంపుల్ టూరిజం, ఖాదీ వస్త్రాలు, బ్యారేజ్, మందస కోవా, మహేంద్ర గిరి, తదితర ముఖ్యమైన ప్రాంతాలపై జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె. చెన్నకేశవరావు కలెక్టర్ కు వివరించారు. జిల్లా పర్యాటక ప్రాంతాలపై కాఫీటేబుల్ బుక్ తయారు చేయాలన్నారు. గనగళ్లవారిపేట వద్ద అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  హోటల్ యాజమాన్యం గనగళ్లవారిపేట వద్ద స్టాల్స్ చేయాలని కలెక్టర్ చెప్పగా ఫెస్టివల్ ఏర్పాటు చేస్తే స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఫెస్టివల్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ చెప్పారు. సాగరమాలలో ఫిషింగ్ జెట్టీలు కోసం కమీషనర్ కు ప్రతిపాదనలు పంపినట్లు మత్స్య శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు చెప్పారు. పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి ఒక జాబితా తయారు చేసి అందజేయాలని ఆదేశించారు. 
జిల్లాలోని పర్యాటక ప్రాజెక్టుల పై పర్యాటక అధికారి నారాయణరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ కు వివరించారు. 
ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు సిహెచ్ రంగయ్య, భరత్ నాయక్, సుదర్శన్ దొర, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసు, రీజనల్ డైరెక్టర్ పి. శ్రీనివాసరావు, ఆర్కియాలజి టెక్నికల్ ఆఫీసర్ కె. శ్రీనివాసరావు, ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్ యన్. మోహనరావు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్, శ్రీకూర్మం ఈఓ గురునాథరావు, సదరన్ ట్రావెల్ మేనేజర్ ఉత్తమ్ కుమార్, వివిధ హోటళ్లు యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*