ఎస్ ఎం సి ఛైర్ పర్సన్ గా ముత్త అరుణ

8/8/2024 9:18:24 PM

తెర్లాం: ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆగస్టు 8: 
తెర్లాం  మండలంలోని సుందరాడ ఎంపీయుపి  పాఠశాలలో గురువారం ప్రధానోపాధ్యాయులు బి. సింహాచలం అధ్యక్షతన, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఎస్ఎంసీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో స్కూల్ కమిటీ ఛైర్ పర్సన్ గా ముత్త అరుణ,వైస్ ఛైర్మన్ నా బొత్స రమేష్ ఎన్నికైనట్లు ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. అనంతరం వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కూల్ అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తానని  అందుకు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎన్నికైన వారికి సర్పంచ్ దిలీప్ కుమార్, నాయకులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తల్లిదండ్రుల పాల్గొన్నారు.

Name*
Email*
Comment*