ఖైదీల క్షమాభిక్షపై ఒక‌టి, రెండు రోజుల‌లో నిర్ణయం

8/12/2024 11:06:36 PM

- రాష్ట్రంలోని జైళ్లలో పరిమితికి మించి ఖైదీలు ఉన్నారని వెల్లడి
- - హోంమంత్రి అనిత

అమ‌రావ‌తి, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌; 
 ఏపీలోని వివిధ జైళ్లలో ఉన్న ఖైదీల స్థితిగతులపై రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందించారు. రాష్ట్రంలోని జైళ్లలో పరిమితికి మించిన ఖైదీలు ఉన్నారని తెలిపారు.  రాజమండ్రి సెంట్రల్ జైలులోనే 1,250 మంది ఖైదీలు ఉన్నారని వెల్లడించారు. వారిలో 376 మంది గంజాయి కేసుల్లో నిందితులని వివరించారు. విశాఖ జైలులో వెయ్యి మందికి పైగా గంజాయి కేసు నిందితులు ఉన్నారని తెలిపారు.  రాష్ట్రంలోని కేంద్ర కారాగారాల్లో డీఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, మానసిక వైద్య నిపుణులను నియమిస్తామని అనిత చెప్పారు.  ఖైదీల క్షమాభిక్షపై చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి ఘటనలోనైనా నిందితులను వారం రోజుల్లోపే పట్టుకుంటున్నామని స్పష్టం చేశారు.

Name*
Email*
Comment*