శ్రీకాకుళం, ఎక్స్ ప్రెస్ న్యూస్;
భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను శనివారం స్థానిక ప్రభుత్వం బాలుర డిగ్రీ కళాశాల మైదానంలో వివిధ శాఖల అధికారులతో ఆయన పరిశీలించారు. పారిశుద్యం, త్రాగునీరు, విద్యుత్ సరఫరా తదితర అంశాలు పై అధికారులకు సలహాలు సూచనలు అందజేశారు. ప్రజా ప్రతినిధులకు, జిల్లా అధికారులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, ప్రజలకు సీటింగ్ ఏర్పాట్లు ప్రోటోకాల్ ప్రకారం చేపట్టాలని, ఆకర్షణీయంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మైదానం అంతా పరిశుభ్రంగా సిద్ధం చేయాలన్నారు. ప్రజలందరూ వేడుకలను వీక్షించే విధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లులను సిద్ధం చేయాలన్నారు.
ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహమ్మద్ ఖాన్, డి.ఎస్.పి.శేషాద్రి నాయుడు రెవిన్యూ డివిజనల్ అధికారులు సి.హెచ్ రంగయ్య, నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు, ఆర్ అండ్ బి ఎస్సీ జాన్ సుధాకర్, శ్రీకాకుళం తహసిల్దార్ గణపతి రావు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.