*విస్తృత ప్రచారం నిర్వహించండి
*రెవెన్యూ డివిజినల్ అధికారి సి.హెచ్. రంగయ్య
శ్రీకాకుళం, ఎక్స్ ప్రెస్ న్యూస్:
బాల బాలికలు ఇద్దరూ సమానమే అని ప్రతి ఒక్కరూ గ్రహించాలని రెవెన్యూ డివిజినల్ అధికారి సి.హెచ్. రంగయ్య తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. స్కానింగ్ కేంద్రాలు లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించి బహిర్గతం చేస్తున్న వారి పై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతిఒక్కరిలో అవగాహనా కల్పించాలని అందునిమిత్తం విస్తృత ప్రచారం నిర్వహించాలాన్నారు. సోమవారం శ్రీకాకుళం ఆర్.డి.ఓ ఛాంబర్ లో లింగ నిష్పత్తి, లింగ నిర్ధారణ (పి.సి.పి.ఎన్.డి.టి) చట్టం అములుపై సబ్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం రెవెన్యూ డివిజినల్ అధికారి అధ్యక్షతన జరిగింది. రెవెన్యూ డివిజినల్ అధికారి మాట్లాడుతూ కేంద్రాలలో సీసీ కెమెరాల పనితీరు పర్యవేక్షించాలని, ఆన్లైన్లో అప్లోడ్ చేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. చట్టంపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు.
ఈ సమావేశంలో ఉప వైద్య ఆరోగ్య అధికారి డా.టి. శ్రీకాంత్, జి.జి.హెచ్ డా.విద్యాసాగర్, గైనకాలజస్ట్ డా. స్వర్ణలత, రేడియాలాజిస్ట్ డా. రాజేష్ కుమార్ ప్రధాన, డా.సుజాత, జిల్లా పౌర సంబంధాల అధికారి కె. బాల మాన్ సింగ్,
డి.పి.ఎమ్ సురేష్ కుమార్, స్వీప్ ఎన్.జి.ఓ కె రమణమూర్తి, అడ్వకేట్ ఆర్.శ్రీనివాస్, పి సి పి ఎన్ డి టి ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎస్ సూర్యకళ తదితరులు పాల్గొన్నారు.