*మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా కృషి చేద్దాం
*జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం, ఎక్స్ ప్రెస్ న్యూస్:
మాధక ద్రవ్యాల దుష్ప్ర భావాలపై యువతకు అవగాహన తప్పనిసరి, యువతపై మాదకద్రవ్యాల ప్రభావం పడకుండా వాటి నియంత్రణే లక్ష్యంగా కృషి చేయాలని అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
ఆగష్టు 12, సోమవారం స్థానిక ప్రభుత్వ పురషుల డిగ్రీ కళాశాలలో 'నాష' ముక్త్ భారత్ అభియాన్" కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ, మొక్కలు నాటడం, అవగాహన కార్యక్రమాలును మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాలల విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించి, మాధక ద్రవ్యాల నివారణ. దుష్ప్ర భావాలపై అవగాహన కల్పించే నినాదలు చేశారు, అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ ఆహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ మాధక ద్రవ్యాల నివారణ అందరి బాధ్యత, ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని ఎందుకు అందరూ సహకరించాలన్నారు.
శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం నిర్వహణ ముఖ్య ఉద్దేశం స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయిందని, ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురువేయాలని, వర్షం స్వాతంత్ర సమరయోధుల పోరాటం వివరాలు వివరించారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తి మనమందరం కొనసాగించాలన్నారు. ఈరోజు నిర్వహించిన ప్రతిజ్ఞకు అందరూ కట్టుబడి ఉండాలన్నారు. స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణానికి అందరూ సహకరించాలని అందులో విద్యార్థిని విద్యార్థుల పాత్ర కీలకమన్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతిశ్రీ మాట్లాడుతూ "నాష ముక్త్ భారత్ అభియాన్" కార్యక్రమాన్ని కేంద్ర సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ శాఖ, భారత ప్రభుత్వం వారు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈరోజు జిల్లాలో కూడా అన్ని పాఠశాలలు, కళాశాలలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కళాశాలలు, వ్యవసాయ కళాశాలలలో సామూహిక ప్రతిజ్ఞ చేసి, మొక్కలు నాటే కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
కార్యక్రమంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, శాసన సభ్యులు ముందుగా సంతకాలు చేయగా, అధికారులు, వివిధ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు సంతకాల కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐఓ దుర్గాప్రసాద్, డివిఇఓ తవిట నాయుడు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.వి.ఎస్ సత్యనారాయణ, ఎన్సిసి క్యాప్టెన్ డా, వై పోలి నాయుడు, డి ఎఫ్ ఓ ప్రతినిధి నాగేంద్ర రావు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా ఆర్ శ్రీనివాస్ పాత్రు, ఆర్. వెంకట్రావు, నారాయణ, శ్రీ చైతన్య, తిరుమల,ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు, అధ్యాపకులు, ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ క్యాండిట్స్ తదితరులు పాల్గొన్నారు.