పెద్దపాడు గురుకులంలో మిగిలు సీట్లకు దరఖాస్తులు ఆహ్వానం

8/12/2024 11:14:56 PM


*ప్రిన్సిపల్ మార్పు జ్యోతి

పెదపాడు, ఎక్స్ ప్రెస్ న్యూస్:   
పెద్దపాడు  డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గురుకులం(బాలికలు)లో మిగులు సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ మార్పు జ్యోతి  తెలిపారు. 5వ తరగతి ఎస్సీ కేటగిరిలో 18 సీట్లు, 6వ తరగతి ఎస్సీ కేటగిరిలో  4 సీట్లు, 7వ తరగతిలో ఎస్సీ కేటగిరిలో 1  సీట్లు, 8వ తరగతి ఎస్సీ కేటగిరిలో 1 సీట్లు, 9వ తరగతి ఎస్సీ కేటగిరిలో 1 సీట్లు , ఎస్ టి కేటగిరీలో 1 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం  ఎస్సీ కేటగిరిలో 12, ఎస్ టి కేటగిరీలో 1, బీసీ కేటగిరీలో 1,ఓసీ కేటగిరిలో 1, ఖాళీగా ఉన్నాయని తెలిపారు. సీట్లు కావాల్సిన విద్యార్థినిలు ఈ నెల 13న ఉదయం 10 గంటలకు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో గురు కులంలో హాజరు కావాలని ప్రిన్సిపాల్ మార్పు జ్యోతి  కోరారు. సీట్లకు మించి అధికంగా విద్యార్థుల హాజరైతే పరీక్ష విధానాన్ని బట్టి సీట్లు కేటాయిస్తామని ప్రిన్సిపల్ తెలిపారు.

Name*
Email*
Comment*