ప్రజా పిర్యాదుల పరిష్కారానికి చొరవ చూపాలి

8/12/2024 11:17:10 PM


జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి 

శ్రీకాకుళం, ఎక్స్ ప్రెస్ న్యూస్; 
ప్రజా పిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి, చట్ట ప్రకారం పరిష్కారానికి చొరవ చూపాలని పోలిసు అధికారులను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ ఆదేశించారు. .సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన  కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, ప్రజల నుంచి పిర్యాదులు స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి, ఫిర్యాదు దారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా వృద్దులు వికలాంగులు వద్దకు  వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ క్రమంలో 50 పిర్యాదులు అందాయి. ఫిర్యాదు దారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు తక్షణమే తెలియ పరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని అదేశించారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఎస్పి అధికారులు ఆదేశించారు.

Name*
Email*
Comment*