నవజాత శిశువులు రక్షణ

8/12/2024 11:21:53 PM

విశాఖపట్నం:ఎక్స్ ప్రెస్ న్యూస్:  
నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., ఈ రోజు ఆంధ్రా మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో నవజాత శిశువులు రక్షణ నిమిత్తం డాక్టర్లు, విద్యార్థులుతో సమావేశమై పలు సూచనలు జారీ చేయడం జరిగినది. అదేవిధముగా వారి సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరిగినది.
సిపి మాట్లాడుతూ ప్రయివేట్ & ప్రభుత్వ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, ప్రసూతి గృహాలు, శిశుజననం మరియు నవజాత శిశు సంరక్షణ సౌకర్యాలు ఉన్న నవజాత శిశువుల కిడ్నాప్‌ను నిరోధించడానికి, ఆసుపత్రిలో ఈ క్రింది సౌకర్యాలు ఉండాలని తెలిపారు.

1. CCTV కవరేజ్
2. కంట్రోల్ రూమ్ నుండి 24 x 7 CCTV పర్యవేక్షణ
3. నియోనాటల్ కేర్ యూనిట్ (నవజాత శిశువుల సంరక్షణా కేంద్రం) వెలుపల ఉన్న ప్రైవేట్ గార్డులు/నవజాత శిశువులు ఉన్న తల్లులకు వసతి కల్పించే గదులు
4. తల్లులు మరియు నవజాత శిశువులకు RFID గుర్తించదగిన ట్యాగ్‌లు తద్వారా శిశువుల మార్పిడికి అవకాశం ఉండదు.
    
                    తదనంతరం వైద్యులు, వైద్య విద్యార్థుల సమస్యలను విన్నారు. వారు తెలిపిన సమస్యలలో ప్రధానముగా కె.జి.హెచ్ భద్రత కు సెక్యూరిటీ నిమిత్తం తెలుపగా,  కె.జి.హెచ్ వారు ప్రైవేట్ ఆసుపత్రిల వలె భద్రతకు ఉత్తమ సెక్యూరిటీ గార్డులు ను నియమించుకోవాలని, పోలీసు వారితో అంటిసిడెంట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలని, అవసరం మేరకు పోలీసు శాఖ వారికి శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రైవేట్ సెక్యూరిటీ తో పాటూ ఒక పోలీసును ఎల్లవేళలా అందుబాటులో ఉంచుతామని, కాలేజి , ఆసుపత్రి నందు అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా పూర్తి అడ్డుకట్ట వేయడం జరుగుతుందని, ఆసుపత్రి ఆవరణలో పెట్రోలింగ్ పెంచుతామని తెలిపారు. ఆసుపత్రి ఆవరణలో అనధికార పార్కింగ్ లేకుండా ట్రాఫిక్ పోలీసులతో తగు చర్యలు తీసుకుంటామని, ఆసుపత్రి ఆవరణలో పొదలు తొలగించుట, భద్రత మరింత మెరుగు చేసే దిశగా ఆసుపత్రి ఆవరణలో తగినన్ని సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుతో పాటుగా, 30 రోజులు సీసీటీవీ ఫుటేజ్ బాధ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైన లైటింగ్ ఏర్పాటుకు సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేస్తామని తెలిపారు. అదేవిధముగా తక్కువ ఎత్తులో వున్న బౌండరీ వాల్ ను ఎత్తు పెంచి ఎవరూ బౌండరీ వాల్ దాటకుండా దానికి పలు రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

                      అనంతరం సిపి వైద్య విద్యార్థులు, వైద్యులతో మాట్లాడుతూ తమకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ లేదా ఇతర మత్తు పదార్థలకు బానిసైన , తక్షణం వారిపై కేసు నమోదు చేయకుండా మార్పు కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చి వారి భవిష్యత్తు కాపాడడం జరుగుతుంది. ఎవరైనా యెటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నా 7995095799 నంబరుకు తెలియజేస్తే నగర ప్రజలు ఎటువంటి సమాచారం కలిగి ఉన్నా, ఎవరైనా పోలీసులు పట్టించుకోవడం లేదన్నా యెటువంటి సమస్యలు ఉన్నా పై నంబరు ద్వారా  స్వయంగా నాకు తెలియజేయండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుంది అని తెలిపారు.

Name*
Email*
Comment*