అన్నాక్యాంటీన్లకు అంతా సిద్దం

8/14/2024 5:54:00 PM

- రోజు వారీ మెనూ, ధరలు ఇలా..
- గుడివాడ‌లో సీఎం చంద్ర‌బాబు ప్రారంభోత్స‌వం

 విశాఖ‌ప‌ట్నం, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌; 
అన్న క్యాంటీన్ల ప్రారంభానికి అంతా సిద్ధ‌మైంది. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడలో అన్నాక్యాంటీన్ ను ప్రారంభించేందుకు నిర్ణయించారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. క్యాంటీన్లలో రోజు వారి అందించే మెనూ..ధరలను ప్రభుత్వం ఖరారు చేయనుంది. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది.  హరేక్రిష్ణ మూవ్ మెంట్ సంస్థకు అన్నా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ సంస్థ కేవలం మూడు గంటల్లోనే లక్ష మందికి ఆహారం సిద్దం చేసే క్యాంటీన్లను ఏర్పాటు చేసింది.

 విరాళాల‌తో...
 15వ తేదీన 99 క్యాంటీన్లు, సెప్టెంబర్ 5న మరో 99 క్యాంటీన్లను ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనుంది. ఇప్పటికే వ్యాపారవేత్తలు, ప్రముఖులు అన్నా క్యాంటీన్ల కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విరాళాలు అందిస్తున్నారు.  ఉదయం టిఫిన్, మధ్నాహ్నం భోజనం రాత్రికి డిన్నర్ ఏదైనా రూ 5 కే అందించాలని నిర్ణయించారు. ఇక, మెనూ ప్రకారం ప్రతీ సోమవారం ఉదయం టిఫిన్ గా ఇడ్లీ (చట్నీ, సాంబార్)లేదా పూరీ కూర్మాతో అందిస్తారు. లంచ్ గా వైట్ రైస్ కూర, పప్పు లేదా సాంబార్, పచ్చడి, పెరుగుతో అందుబాటులోకి తెస్తున్నారు. వారంలో ప్రతీ రోజు లంచ్,డిన్నర్ లో భాగంగా ఇదే రకంగా మెనూ ఉండనుంది. పదార్ఢాలు మాత్రం మారనున్నాయి.  మంగళవారం నుంచి శనివారం వరకు ఉదయం అందించే టిఫిన్ లో ఇడ్లీ కామన్ గా ఉంటుంది. ఇక, రెండో టిఫిన్ గా పూరీ, పొంగల్, ఉప్మా అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 7.30 గంట‌ల నుంచి 10 గంటల వరకు టిఫిన్ ఉంటుంది. లంచ్ మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటల వరకు అందిస్తారు. రాత్రి 7.30 గంట‌ల నుంచి 9 గంటల వరకు అందుబాటులో ఉండనుంది. ఆదివారం సెలవుగా ప్రకటించారు. వారంలో ఒక రోజు స్పెషల్ రైస్ ఇవ్వనున్నారు. ప్రభుత్వం విరాళాలు ఇచ్చే వారు ముందుకు రావాలని పిలుపునిచ్చింది.

Name*
Email*
Comment*