మ‌న బ‌లం, బ‌ల‌గంతో బాబు వెనుక‌డుగు

8/14/2024 6:06:19 PM

- అందుకే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో ఈ విజ‌యం
- విశాఖ జిల్లా పార్టీ నేత‌ల‌తో మాజీ  ముఖ్యమంత్రి జగన్  

 విశాఖ‌ప‌ట్నం, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌;  
వైసీపీ కేడర్ బలంగా కనిపించటంతో చంద్రబాబులో భయం మొదలైందని మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాజా పరిణామాల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. విశాఖ జిల్లా పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ప్రతీ ఇంటికీ మనం చేసిన మంచి బతికే ఉందని, మేనిఫెస్టో అమలులో విశ్వసనీయతకు అర్థం చెప్పామన్నారు. బలం లేకపోయినా పోటీ చేద్దామని భావించిన వారి మెడలు వంచి విజయం సాధించామని జగన్ చెప్పుకొచ్చారు. సాకులు చెప్పలేదు చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని, మన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయని, వాటికి వడ్డీలు కూడా ఉన్నాయనే విషయాన్ని వైయ‌స్‌ జగన్‌ మరోసారి గుర్తు చేశారు. ఆ సమయంలో కోవిడ్‌లాంటి విషమ పరిస్థితులు వచ్చాయన్నారు. ఖర్చులు అనూహ్యంగా పెరిగినప్పుడు ఎలాంటి సాకులు చెప్పలేదని, శ్వేతపత్రాలతో నిందలు మోపే ప్రయత్నం చూపలేదని, కోవిడ్‌ను సాకుగా చూపి ఎగ్గొట్టలేదని జగన్ వివరించారు. 

వ్యతిరేకత మొదలు 
ఈ రెండున్నర నెలల పాలనలో ఒక ప్రభుత్వం మీద ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ చూడలేదని జగన్ వ్యాఖ్యానించారు.  వైయ‌స్ జగనే ఉండి ఉంటే.., వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉండే.. అన్న చర్చ జరుగుతోందన్నారు. ఈపాటికే అమ్మ ఒడి అందేది, రైతు భరోసా అందేది, రైతులకు పంటల బీమా అందేది: ఫీజురియింబర్స్‌మెంట్‌నేరుగా ఖాతాల్లో పడేదని చెప్పుకొచ్చారు. పథకాల కోసం ఎవ్వరినీ అడగాల్సిన పనిలేకుండా సాఫీగా అమలు జరగేవని పేర్కొన్నారు. స్కూళ్లలో టోఫెల్‌ పీరియడ్‌ను ఎత్తివేశారని.ఇం.గ్లిషుమీడియం నడుస్తుందన్న ఆశ లేదన్నారు. మధ్యాహ్న భోజనం ప్రశ్నార్ధకం అయ్యిందని జగన్ చెప్పుకొచ్చారు. అందుకే తగ్గారు ఆరోగ్య రంగం పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. ఆరోగ్య శ్రీ బకాయిలు రూ.1800 కోట్లపైనే దాటిందని వివరించారు. రైతులు మళ్లీ క్యూలలో ఉండాల్సిన పరిస్థితి విత్తనాలకోసం ఇ- క్రాప్‌ పక్కనపడేశారని పేర్కొన్నారు.ఉచిత పంటల బీమాను వదిలేశారని..బియ్యం డోర్‌ డెలివరీ లేదన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ, మళ్లీజన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వస్తోందని వివరించారు. రెడ్‌ బుక్‌ పాలన సాగుతోందని జగన్ విమర్శించారు. చంద్రబాబు మోసాలు చూసి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వివరించారు. పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఒక్కటిగా ఉన్నారు కాబట్టి విశాఖ ఎన్నికల్లో చంద్రబాబు వెనక్కితగ్గారని జగన్ చెప్పుకొచ్చారు.

Name*
Email*
Comment*