ఝాన్సీ అగ్రికల్చర్ అండ్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ

9/6/2024 6:55:55 PM

మట్టి గణపతిని పూజిద్దాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం- తులగాపు ఝాన్సీ

ఎల్ఎన్ పేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 06:
ఝాన్సీ అగ్రికల్చరల్ అండ్ ఇంటిగ్రేటెడ్  వెల్ఫేర్ సొసైటీ (నెహ్రూ యువకేంద్ర అనుబంధ సంస్థ) ఆధ్వర్యంలో మట్టి వినాయకుని  విగ్రహాలు పంపిణీ కార్యక్రమం ఎన్.వై.కె వద్ద నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జ్యోతిరావు పూలే ఆల్ ఇండియా ఓ.బి.సి ఉత్తరాంధ్ర జనరల్ సెక్రటరీ  రౌతు శంకరరావు పాల్గొని మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచభూతాల సమాహారం అని, అన్ని విఘ్నాలు తొలగించే ప్రత్యక్ష దైవమని తెలియజేశారు. ఝాన్సీ అగ్రికల్చరల్ అండ్ ఇంటిగ్రేటెడ్  వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి తులగాపు ఝాన్సీ మాట్లాడుతూ మట్టి గణపతిని పూజిద్దాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం' నిజానికి ప్రతి ఒక్కరూ ఇలా మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేసినట్లే ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కృత్రిమ రంగులు వాడిన వినాయకులను పూజించి వాటిని నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమై పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఝాన్సీ  తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సంస్థ  అధ్యక్షులు రౌతు సుమతి మోహనరావు, సత్యనారాయణ, సన్యాసిరావు, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*