డా.మిశ్రో కు దక్కిన ఎడ్యుకేషన్ గ్లోరి, రీజినల్ బెస్టు టీచర్స్ అవార్డ్ లు

9/6/2024 8:27:31 PM

ఎల్ఎన్ పేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 06:
లక్ష్మీనర్సుపేట గ్రామానికి చెందిన లయన్.డా.ఎం.కె.మిశ్రో విద్యారంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భం గా "ఎడ్యుకేషన్ గ్లోరి అవార్డు" ను  వర్చువల్ విధానం ద్వార అందచేసినట్లు" ద టార్గెట్ బుక్ ఆఫ్ రికార్డ్స్" వారు తెలియజేసారు. ఎల్ ఎన్ పేట మండలం లో పాతపట్నం నియోజకవర్గం శాసన సభ్యులు మామిడి గోవిందరావు సహకారంతో మండల విద్యా శాఖ అధికారులు సిహెచ్.మణి కుమార్, కె.చంద్ర మౌళి ల ఆధ్వర్యం లో  ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని ఉపాధ్యాయ దినోత్సవం-2024 నందు లయన్. డా. ఎం.కె.మిశ్రో కు సన్మానం జరిగింది. లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రీజినల్ బెస్టు టీచర్స్ అవార్డ్ పొందిన లయన్.డా.ఎం.కె.మిశ్రో
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భం గా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ రీజినల్ ఛైర్పర్సన్  వి.వి. రంగనాథ్, లయన్స్ క్లబ్ నరసన్నపేట ఛైర్మన్ రమణ సాహు, క్లబ్ ప్రతి నిధులు, శ్రీకాకుళం లయన్స్ క్లబ్ మెంటార్ నటుకుల మోహన్ ద్వారా "రీజినల్ బెస్టు టీచర్ " అవార్డు ను లయన్.డా.ఎం.కె.మిశ్రో కు నరసన్నపేట లో ప్రధానం చేశారు.

Name*
Email*
Comment*