మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం

9/6/2024 8:31:02 PM

- మట్టితో తయారుచేసిన 1,500 గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన సిరిపురం

ఎల్ఎన్ పేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 06:
పాతపట్నం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సిరిపురం తేజేశ్వరరావు హిందువులకు ప్రథమ పండుగ అయిన వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టితో తయారు చేయించిన 1,500 గణపతి విగ్రహాలను నియోజకవర్గంలో ఐదు మండలాలలో స్వయంగా పంపిణీ చేశారు. మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలు పంచభూతాల సమాహారం అని విజ్ఞాలను తొలగించే ప్రత్యక్ష దైవం విగ్నేశ్వరుని మట్టితో తయారు చేసి పూజించడం వలన పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్లమవుతామని, ప్లాస్టిక్ కృత్రిమ రంగులు ద్వారా తయారు చేసిన వినాయకుని నిమజ్జనం చేయటం వల్ల నీరు కలుస్తామయి నీటిలో జీవించిన పలు రకాల జీవజాతులకు ముప్పు వాటిల్లుతుందని అనేక ఇబ్బందులు కలుగుతాయని, నీరు కలుషితమై పర్యావరణానికి హాని కలుగుతుందని, అదే మట్టితో తయారు చేసిన గణపతిని నిమజ్జనం చేయడం వలన మంచిదని వివరించారు. రాబోయే తరాలకు జాతులపైన అవగాహన కల్పించి ప్రకృతిని ప్రేమించి ప్రకృతి యొక్క ఆగ్రహానికి గురికాకుండా మట్టి వినాయకులను పూజించడం వలన పర్యావరణ సమతుల్యతను కాపాడగలుగుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐదు మండలాల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*