ఆకట్టుకున్న ముగ్ద (పెసర)గణపతి

9/6/2024 8:32:50 PM

- ఉద్దానం యూత్ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా వినూత్న విగ్రహం 
- 2012 నుండి వినూత్న విగ్రహాలు తయారీ ఆ క్లబ్ సొంతం 
- పలు అవార్డులు కైవసం చేసుకున్న శిల్పి  బైరి తిరుపతి 
 
కంచిలి: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6:
కవిటి మండలంలోని బోరువంక గ్రామంలో గల ఉద్దానం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే ఈ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా వినాయక విగ్రహాలను పర్యావరణానికి హాని కలిగించకుండా ఇకో ఫ్రెండ్లీ వినాయకుడిని వినూత్నంగా తయారు చేయడం ఆ క్లబ్బు ప్రత్యేకత. అందులో భాగంగా ఈ ఏడాది (ముగ్ద గణపతి) పెసర విత్తనాలు వేసి నారుతో తయారుచేసిన విగ్రహాన్ని క్లబ్బుకు చెందిన ప్రముఖ శిల్పి పైరి తిరుపతి తయారు చేశారు. 2012 నుండి ఇప్పటివరకు ప్రతి ఏడాది ఇకో ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేస్తూ వస్తున్నారు.కొబ్బరికాయలు గణపతి(2012) ,నలుగు గణపతి (2013),వరి నారు గణపతి(2014) , వనమూలికల గణపతి (2015), పామాయిల్ గణపతి(2016), గోధుమ నారు గణపతి (2017),కొబ్బరి పువ్వుల గణపతి(2018), సుద్ధముక్కల గణపతి(2019),నల్ల జీడిపిక్కల గణపతి(2021),ఆవాలు గణపతి(2022), పసుపు కొమ్ముల గణపతి(2023) విగ్రహాలను పర్యావరణానికి హాని కలిగించకుండా సహజ వనరులతో సజీవంగా ఉండే ఈకో ఫ్రెండ్లీ  వినాయకుడి విగ్రహాలను తయారు చేస్తుండడంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులను సొంతం చేసుకున్నారు  యూత్ క్లబ్ సభ్యులు. అందులో భాగంగానే ఈ ఏడాది 2024 లో  కూడా వినాయక చవితి ఉత్సవాలు భాగంగా క్లబ్ కు చెందిన శిల్పి తిరుపతి మనం తినే ఆహారం పెసలు తో నారువేసి వాటిని మొలకెత్తించి ఈ గణపతిని తయారు చేశారు.

Name*
Email*
Comment*