పర్యావరణాన్ని కాపాడండి -మట్టి విగ్రహాలను పూజించండి

9/6/2024 8:34:15 PM

కంచిలి: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6: 
పర్యావరణాన్ని కలుషితం చేసే వ్యర్ధపదార్థాలతో తయారుచేసిన వినాయక విగ్రహాలను కాకుండా మట్టితో తయారు చేసే  వినాయక విగ్రహాలు తో పూజలు చేయడంతో సమాజ శ్రేయస్సును కోరే కంచిలి పట్టణనికి చెందిన కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో సుమారు 2500 మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులచే ప్రజలకు అవగాహన నిమిత్తం మట్టి వినాయక విగ్రహాలను పూజించండి పర్యావరణాన్ని కాపాడండి అనే నినాదంతో మటం కంచిలి నుండి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీగా ప్రచారం చేయడం జరిగింది. అనంతరం వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు చే మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడే ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చైతన్యపరిచే విధంగా తమ వంతుగా సహాయపడిన కళింగ వైశ్య సంఘానికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ తో పాటు స్థానిక మండల తహసీల్దార్  జయలక్ష్మి మండల అభివృద్ధి అధికారి వీ నీరజ తెలుగుదేశం పార్టీ నాయకులు జగదీష్ పట్నాయక్ మాదిన రామారావు కళింగ వైశ్య సంఘ అధ్యక్షులు ఇప్పిలి ప్రవీణ్, కొత్తకోట నాగరాజు తదితర కుల పెద్దలు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*