జ్వరాలు వేల.. రోగులు గోల

9/6/2024 8:36:14 PM


కంచిలి: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6: 

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో జ్వరాల బారిన పడిన అనేక మంది రోగులు ప్రభుత్వ దావకానాలు చుట్టూ తిరుగుతున్న పరిస్థితులలో కంచిలి పిహెచ్సిలు మాత్రం ఆ ఊసే లేకుండా పోయింది. 10 గంటల వరకు దావకాన తలుపులు కూడా తీయని పరిస్థితి నెలకొనడంతో రోగులు ఇబ్బందులు పడుతూ  ప్రైవేటు  దావకానాలకు వెళ్ళిపోతున్న పరిస్థితి కంచిలి మరియు ఎం.ఎస్ పల్లి ప్రభుత్వ దావకానాల వద్ద కనిపిస్తుంది. గ్రామాలలో అనేకమంది జ్వరాలు బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వచ్చినప్పటికీ పేరుకు 24 గంటలు అని బోర్డులు వేలాడు తీయడమే తప్ప అక్కడ వైద్యులు గాని సిబ్బంది గాని లేకపోవడం కనీసం తలుపులు తాళాలు తీయడం కూడా లేకపోవడంతో రోగులు వెనుదీరిగే పరిస్థితి గత కొద్ది కాలంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలకు సరైన వైద్య సేవలు అందించే దిశగా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

Name*
Email*
Comment*