ఎంఎస్ పల్లి పంచాయతీ నిధులు అవకతవకలు

9/6/2024 9:00:55 PM

కంచిలి: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6:
మండలం మఠంసరయా పల్లి పంచాయతీలలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో డి ఎల్ పి ఓ  రమణ ఆధ్వర్యంలో శుక్రవారం విచారణ చేపట్టడం జరిగింది. పంచాయితీలో గల వివిధ పనులకు సంబంధించి జరిగిన అవకతవకలను స్థానిక సర్పంచ్ కొనపల సురేష్ పై చర్యలు తీసుకునే దిశగా డిఎల్ పి ఓ ఆరోపించినట్లు తెలిపారు. మెయిన్ రోడ్ లో సిర్తలి సరయాపల్లి రెవిన్యూ లో సుమారు 20 లక్షలు విలువ చేసే పంచాయతీ స్థలంలో రోడ్డు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మేలు చేసే విధంగా వేయడంతో ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూరిందని, సరయపల్లి రోడ్ నందు గల ఖాళీ స్థలంలో లక్ష రూపాయలు కూడా ఖర్చు చేయకుండా గత ఏడాది ఆగస్టులో రెండు లక్షల 90 వేల 600 రూపాయలు మట్టి వేసినట్లు చూపి ఆ డబ్బులు అక్రమాలకు పాల్పడ్డారని, రాజీవ్ నగర్ నందు పైప్ లైన్ పనులు చేయకుండా 80000 బిల్లు చేశారని ఎస్సీ వీధిలో మండపం నిర్మాణం విషయంలో అత్యధికంగా బిల్లు చేశారని, సొండి వీధి లోగల మండపానికి టైల్స్ వేసి మండపం నిర్మించినట్లు బిల్లు చేసుకున్నారని ఈ విధంగా వివిధ రూపాలలో అత్యధికంగా అక్రమ బిల్లులను పంచాయతీ నిధులను దుర్వినియోగపరచినట్లు అధికారులు ధ్రువీకరించారు. పై విషయాలను జిల్లా అధికారులకు తెలియజేస్తూ చెక్ పవర్ రద్దు చేస్తూ తగు చర్యలు చేపడతామని తెలిపారు.

Name*
Email*
Comment*