ఆయన సేవలు చిరస్మరణీయం

9/6/2024 9:03:14 PM

- వాసు వర్థంతి సభలో వక్తలు

 సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6:
దివంగత ఇవోపిఆర్డీ , ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధి తెంబూరు వాసుదేవరావు అందించిన సేవలు చిరస్మరణీయమైనవని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆయన ప్రథమ వర్థంతి సంధర్భంగా మందస డాక్టర్  బిఆర్ అంబేద్కర్ విజ్ఞాన భవనంలో శుక్రవారం ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  నిర్వహించిన కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘ అధ్యక్షులు కొత్తపల్లి మోహనరావు. మాట్లాడుతూ దళిత సామాజిక వర్గాల వేగుచుక్క వాసు దేవ రావు  అని ,  అన్నారు. దళిత సమాజానికి ఆయన విశేష కృషి చేశారని అన్నారు. ఆయన కృషి, పట్టుదల వృత్తి పట్ల నిబద్ధత, నేటి దళిత సమాజానికి యువ తరానికి ఆదర్శం అన్నారు. సంఘ కార్యదర్శి సంక కాళిదాసు  మాట్లాడుతూ ఆయన నుండి చాలా నేర్చుకున్నానని, ఆయన అడుగు జాడలలో నడుస్తానని, మందసలో  ఇంత పెద్ధ సంఘ భవనం నిర్మాణాన్ని  స్వర్గీయ డా"  మిస్క ఆనంద రావు మరియు తెంబ వాసుదేవరావుల కృషి ఎంతో ఉందని  కొనియాడారు. సంఘ కోశాధికారి యారుమాకు  తులసీదాస్ మాట్లాడుతూ ఎంతటి క్లిష్ట సమస్యనైనా  తన వాక్చాతుర్యంతో  సమస్య పరిష్కారం చేసేవారు అని ఆయన లేని లోటు కనిపిస్తోంది అని ఆవేదన వ్యక్తంచేశారు. పలాస ,ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిధిలోని అనేక మండలాల్లో ఉద్యోగరీత్యా ఆయన అందించిన సేవలు నేటికీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని ,అటువంటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర షెడ్యూల్  కులాల  సంక్షేమ   సంఘ ఉపాధ్యక్షులు అధ్యక్షులు బాడియ కామరాజు,  మాజీ సర్పంచ్ పట్టాభి రామారావు,  తలగాన హేమ రావు, నగరి తారకేశవరావు రావు, తెంబ శ్రీనివాసరావు,  ఇప్పిలి చంద్రశేఖర్ , యానాది వాసు,  నగరి  విజయ్, జడ్జీడా శాంత రావు , మట్ట ధన రాజు,  జన్నె  దుర్యోధన, చీమలు కోటి, మరియూ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఎస్సీ వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ మందస తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు.

Name*
Email*
Comment*