ఉపాధ్యాయులకు ఘన సన్మానం

9/6/2024 9:16:17 PM

తగరపువలస: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6:
ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా గురువారం అంబేద్కర్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులకు విద్యా కమిటీ చైర్మన్ దండి వెంకటేష్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల తర్వాత మనిషి జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి గురువు అని ఆయనను సత్కరించుకోవడం మనకు దక్కిన అరుదైన అవకాశమని కొనియాడారు.అనంతరం  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  ఎలిమెంటరీ స్కూల్ తో పాటు బంగ్లామెట్ట ప్రైమరీ స్కూల్,బాలాజీ నగర్ ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి సన్మానించారు.ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఒకటవ వార్డు టీడీపీ అధ్యక్షులు తమ్మిన సూరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు, స్కూల్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*