పిల్లల మనోవికాసానికి ఆటలు పీరియడ్లు అవసరం

9/6/2024 9:25:10 PM

:రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సీతారాం 

భీమునిపట్నం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6;
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు ఒత్తిడిని తట్టుకునేలా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేటు,కార్పొరేట్ పాఠశాలల్లో ఆటలకు కొంత సమయాన్ని కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వివిధ సిఫారసులు చేయనుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం చెప్పారు.    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ,జిల్లా విద్యాశాఖలు సంయుక్తంగా బాలల హక్కుల పరిరక్షణలో ఆనందపురం,పద్మనాభం,భీమిలి మండలాల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు,ప్రిన్సిపాళ్లు పాత్రపై శుక్రవారం భీమిలిలోగల కేథరిన్ పాఠశాల సమావేశ మందిరంలో అవగాహనా సదస్సు నిర్వహించారు,ఈ కార్యక్రమానికి గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఖలీషా బేగం సమన్వయ కర్తగా,పద్మనాభం,భీమిలి మండల విద్యాఖాధికారులు శివరాణి,పి.రమణలు అధ్యక్షత వహించారు.   ఈ సదస్సునుద్దేశించి ముఖ్య అతిథిగా హాజరైన సీతారాం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం,జాతీయ,రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లు ఏకైక లక్ష్య సాధనలో భాగంగా,పాఠశాలల్లో విద్యార్థుల మానసిక వికాసానికి తోడ్పడే క్రీడల ప్రాధాన్యతను పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు,ఖచ్చితంగా ఆటలకోసం ప్రత్యేక పీరియడ్లను అమలు పరిచేలా వివిధ సూచనలతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు సారధ్యాన తాము రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ సిఫారసులు చేయనున్నామని అన్నారు. బాలలపై లైంగిక దాడులు నిర్మూలన,మంచి,చెడు స్పర్శలుపై పిల్లల్లో అవగాహన,ఆడపిల్లల ఋతు స్రావం సమయంలో మానసిక ఒత్తిడి కలగకుండా ఆరోగ్య సూత్రాలు అమలు,బాలల హక్కులు,చట్టాలపై అవగాహన కార్యక్రమాలు,పిల్లలు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా పాఠశాలల ప్రాంగణాల్లో ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు,వాటి పరిశీలనకు ప్రత్యేక దృష్టి పై నిర్విరామంగా దృష్టి సారిస్తున్నామని అన్నారు.
 అలాగే పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించలేదన్న నెపాన్ని విద్యార్థులపై నెట్టడం కూడా సరైంది కాదన్నారు,డైరీల్లో,హోమ్ వర్క్ పుస్తకాల్లో వ్రాయడం,నలుగురి మధ్య నిలబెట్టడం,తరగతి ఆరుబయట ప్రత్యేక శిక్షలు వంటి అంశాలపై తమ కమిషన్ ప్రత్యేక దృష్టి సారుస్తుందని అన్నారు,ఇటువంటి ఫిర్యాదులను తాము సుమోటోగా స్వీకరించి చట్టప్రకార చర్యలకు ఆయా జిల్లాల కలెక్టర్లు,జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. 
  గ్రీన్ ఎంబసీ ఫౌండర్ ఉమారాజ్,సైకాలజిస్ట్ ఎం.వంశీ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా అన్ని పాఠశాలల్లో బాలల హక్కులు,వారి పరిరక్షణ, సమస్యలుపైనా,వక్తృత్వ పోటీలు,పాఠశాలల్లో వివిధ అవగాహనా బోర్డులు ఏర్పాటు,ర్యాలీలు,వివిధ రంగాల వైద్య,సమాజ ప్రభావిత నిపుణులతో ముఖాముఖి   కార్యక్రమాలు ఏర్పాటుతో చక్కని పిల్లల సమాజాన్ని చూడగలమని అన్నారు.
    భీమిలి చైల్డ్ డెవలప్మెంట్ ప్రోజెక్ట్ ఆఫీసర్ ఎం.శ్రీదేవి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాలు,రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో తమ పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలల హక్కులు వారి సంక్షేమానికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు 
   ఈ కార్యక్రమంలో భీమిలి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పి.ఎస్.ఎస్.వి.ప్రసాద్,కేథరిన్ స్కూల్ ప్రిన్సిపాల్ సౌజన్య సాయి,  ఐ.సి.పి.యు.ప్రతినిధులు లీగల్ కం ప్రోబేషన్ ఆఫీసర్ ఐ.అనీజ, బి.శకుంతల,స్వాంతన సంస్థ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ సి.హెచ్.ఝాన్సి లక్ష్మీ, ఎన్ ఎస్ ఎస్ సోషల్ వర్కర్ వనం కళ్యాణ్,అంగన్వాడీ సూపర్ వైజర్లు,ఉమాజానకి, రేఖావాణి,వివిధ వార్డుల మహిళా సంరక్షణ,ఆరోగ్య కార్యదర్శులు, మూడు మండలాల ప్రైవేటు స్కూళ్లు యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్ళు,సీఆర్ఎంటిలు తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*