'స్నోయి' కి సంవత్సరీకం జరిపించిన ఏఎస్ఐ గోవిందమ్మ

9/6/2024 9:29:17 PM

- పెంపుడు కుక్క వర్ధంతికి పేదలకు రగ్గులు, చీరలు, భోజనాలు పంపిణీ 

ఎన్ఏడి: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6: 
ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగి, కన్న బిడ్డలా చూసుకున్న కుక్క మృతి చెంది ఏడాది గడిచినా ఏఎస్ఐ గోవిందమ్మ ఆ బాధ నుంచి ఇంకా తేరుకోలేదు. విశాఖ సిటీ పోలీస్ శాఖలో గోపాలపట్నం క్రైమ్ ఏఎస్ఐగా పని చేస్తున్న గోవిందమ్మ 'స్నోయి' ఆనే కుక్కను ఎంతో ఆనందంగా పెంచుకున్నారు. ఇంట్లో స్నోయి సందడి అంతా ఇంతా కాదు. స్నోయి లేకపోతే తాను లేను అన్నట్టే గోవిందమ్మ ఉండేవారు. అయితే ఆ కుక్క గతేడాది ఇదే రోజున మృతి చెందింది. దీంతో గోవిందమ్మ భరిoచలేకపోయారు. స్నోయి సంతాప దినం పేరిట వివేకానంద సంస్థ ఆధ్వర్యoలో ఏఎస్ఐ గోవిందమ్మ అప్పట్లో పేదలకు భోజనాలు పెట్టించారు. ఇప్పుడు ఆ కుక్క మృతి చెంది ఏడాది గడిచిన సందర్బంగా సంవత్సరీకం అంటూ గురువారం పేదలకు రగ్గులు, చీరలు, భోజనాలు పంపిణీ చేశారు. వైజాగ్ లోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రైల్వే స్టేషన్ మధ్య రోడ్డు పక్కన ఉండే అభాగ్యులకు గోవిందమ్మ స్నోయి పేరిట సేవలందించారు.

Name*
Email*
Comment*