కొండచరియలు విరిగిన ప్రాంతాన్ని సందర్శించిన ఎమ్మెల్యే గణబాబు

9/6/2024 9:33:41 PM


ఎన్ఏడి, ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6: 
జీవీఎంసీ పశ్చిమ నియోజకవర్గం 90 వ వార్డు  ఎఫ్. బ్లాక్ లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా కొండ చర్యలు విరిగి పడటంతో అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు ఎన్నో ఏళ్లగా ఈ ప్రాంతంలో వర్షం కురిస్తే ఆ ప్రాంతమంతా మట్టి కూడిన కొండవాలు విరిగి పడుతూ ఉంటాయి ఎప్పుడు ఏ విధంగా ఎలా జారిపడతాయో ఎవరికీ తెలియదు వర్షం వస్తే చాలు ప్రాణాల అరచేతులు పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తూ ఉంటామని అన్నారు దీనికి దీర్ఘకాల  చర్యలు చేపట్టాలని అని అన్నారు అదేవిధంగా దీనికి రిటైనింగ్ వాల్స్ లేక పోవడంతో మట్టి జారి పడుతున్నాయని తెలిపారు ఇందులో భాగంగా మెట్లు మార్గం కూడా కూలిపోయింది ఈ మేరకు అక్కడ నివసిస్తున్న ప్రజలు ఎమ్మెల్యే గణబాబుకి తెలియపరచక శుక్రవారం ఉదయం ఆ ప్రాంతాన్ని సందర్శించిన విశాఖ పశ్చిమ  నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే గణబాబు. అనంతరం అక్కడ నివసిస్తున్న ప్రజలతో ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ  స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని జోన్-8  ఇంజినీరింగ్ అధికారులకు త్వరగా ఈ సమస్య పరిష్కరించాలని సూచించారు  అదేవిధంగా జీవీఎంసీ కమిషనర్ సంపత్తో మాట్లాడి వర్క్స్ అప్రూవల్ చేయాలని కోరారు. పర్యటనలో పాల్గొన్న 90 వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ ,మాణిక్యాలు, టిడిపి నాయకులు , జోన్. 8 ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ,డి.ఈ , ఏ ఈ, తదితరులు  పాల్గొన్నారు.

Name*
Email*
Comment*