స్థానిక సమస్యలపై కలెక్టర్ కు ఫిర్యాదు

9/6/2024 9:34:59 PM

ఆనందపురం:  ఎక్స్ ప్రెస్ న్యూస్:  సెప్టెంబర్ 6 :
 గ్రామీనా పట్టణాలలో ప్రభుత్వ పాఠశాలలో రోజు ఇచ్చే డొక్కా సీతమ్మ భోజనం పట్టికను ( మెను ) మార్పులు కోసం ప్రభుత్వం  చొరవ తీసుకొని  ప్రతి ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రధానోపాధ్యాయులు నూతనంగా ఎన్నికైన ఎస్ఎంసి చైర్మన్లు జిల్లా కలెక్టర్ ఆఫీసు లో సమావేశమయ్యారు. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ ఎస్ఎంసి చైర్మన్ చల్లారామిరెడ్డి అలియాస్ (సుబ్బు) కలెక్టర్ కు స్థానిక సమస్యలపై ఫిర్యాదు చేశారు.  స్కూల్ కి వెళ్లే మార్గంలో ఎల్ఎంటి కాంక్రీట్ అలాగే  వ్యర్థ పదార్థాలు చుట్టుపక్కల పశువులు కళేబరాలు   చికెన్ షాప్ మటన్ షాపు వంటి షాపుల నుంచి వచ్చే వేస్టేజ్ ఎక్కువగా పడేస్తున్నారు వాటి వల్ల రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదన్నారు. అదే మార్గంలో కొంతమంది మందుబాబులు  సాయంత్రం అయ్యేసరికి మద్యపానం సేవించడం  కాలకృత్యాలు కూడా అక్కడ చేస్తున్నారు అని వాపోయారు  అదేవిధంగా ఎంతోమంది తల్లుల కడుపుకోత మిగిల్చిన గంభీరం డ్యామ్ కి కూడా చాలామంది స్టూడెంట్స్ వెళ్లి మృత్యువాత పడుతున్నారు డ్యామ్ వద్ద సెక్యూరిటీ గాడ్స్ ని ఏర్పాటు చేసినట్లయితే మున్ముందు ఇంకొన్ని ప్రాణాలు కాపాడిన వారు అవుతామని కలెక్టర్ కు  విన్నవించారు.

Name*
Email*
Comment*