హెల్మెట్ లేని వారిపై ప్రత్యేక స్పెషల్ డ్రైవ్

9/6/2024 9:38:58 PM

-837 మంది డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలిక రద్దు

ఎన్ఏడి, ఎక్స్ ప్రెస్ న్యూస్. సెప్టెంబర్ 06:
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా మరియు వెనుక కూర్చున్న వ్యక్తులు కూడా హెల్మెట్ ధరించకుండా తిరుగుతున్న వాహనదారులపై పోలీసు శాఖ వారు కేసులు నమోదు చేసిన వాటిలో 837 మంది డ్రైవింగ్ లైసెన్సులు 3 నెలలు సస్పెండ్ చేయడం కోసం రవాణా శాఖకు పంపడం జరిగిందని నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిన 837 మంది డ్రైవింగ్ లైసెన్సులు 3 నెలలు పాటు తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని ఉప రవాణా కమీషనర్ రాజారత్నం తెలిపారు.సెప్టెంబర్ ఒకటవ తేది నుంచి సెప్టెంబర్ ఐదవ తేది వరకు 2325 మంది వాహనదారులు పై కేసు నమోదు చేయడం జరిగిందని వాటిలో 837 మంది డ్రైవింగ్ లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని అన్నారు.ఇక పై కూడా ఈ తనిఖీలు నిరంతరం నిర్వహించబడతాయని,ద్విచక్ర వాహనం నడిపిన వారు మరియు వెనుక కూర్చున్న వారు హెల్మెట్ ధరించాలి,అలా ధరించక పొతే వారి ఇద్దరి పై కేసులు నమోదు చేసి డ్రైవింగ్ లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేయడం జరుగుతుందని ఉప రవాణా కమీషనర్ రాజరత్నం తెలిపారు.

Name*
Email*
Comment*