పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

9/6/2024 10:21:43 PM


*జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీకాకుళం: ఎక్స్ ప్రెస్ న్యూస్:
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ తన పర్యటనలో భాగంగా ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఫ్రైడే డ్రై డే  కార్యక్రమ అమలును శ్రీకాకుళం కెళ్ళ వీధిలో ఆకస్మికంగా పర్యటించారు. కెళ్ళ వీధి మొత్తం పర్యటించి చేపడుతున్న ఫ్రైడే డ్రై డే నిర్వహణ తీరును పరిశీలించారు. కెళ్ల వీధిలో నివాసం ఉన్న వారికి ప్రతీ రోజు మునిసిపల్ సిబ్బంది విధులకు హాజరు అవుతున్నారా అని ఆరా తీయగా వస్తున్నారు అని తెలుపగా, నిర్వహణ పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిసర ప్రాంతాలల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, అక్కడ ప్రజలకు డ్రై డే ఫ్రై డే పాటించాలని తెలియచేసారు. కీటకజనిత వ్యాధుల నుండి జాగ్రత్త గా ఉండాలని, దోమల లార్వా పెరగకుండా, నీటి కుంటలు లేకుండా చూసుకోవాలని, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాదుల నుండి జాగ్రత్తగా ఉండాలని పలు సూచనలు చేశారు. ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్  డా. సుధీర్, బి. గణేష్ కుమార్, సచివాలయ,  మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Name*
Email*
Comment*