పూర్వ విద్యార్థుల సేవలు అభినందనీయం

9/6/2024 10:23:22 PM


శ్రీకాకుళం, ఎక్స్ ప్రెస్ న్యూస్; 
జిల్లాకి తలమానికమైన ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల స్కూలు అభివృద్ధి కోసం చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీ తిరుమల చైతన్య అన్నారు .విద్యార్థుల కోసం ఒక భోజనశాలను ఐదున్నర లక్షలవ్యయంతో నిర్మించడం హర్షదాయకమని ,భోజనశాలను ప్రారంభిస్తూ ఆయన అన్నారు.స్కూలు విద్యార్థుల సంఖ్యను పెంచే కృషి కూడా చేయాలని ఆయన పిలుపునిచ్చారు  సంపాదించడం కన్నా ఉన్నంతలో సమాజానికి మనం ఏమి ఇచ్చాము అనే అంశం మనిషిని ఉన్నతుడిని చేస్తుందని ఆ దిశలో పూర్వ విద్యార్థుల సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ పొగిరి సుగుణాకర్ రావు అన్నారు . స్కూలు అభివృద్ధి కోసం విద్యార్థులకు ప్రోత్సాహాలు అందించడం, ఉపాధ్యాయులకు అన్ని విధాల అండదండలు అందిస్తూ పూర్వ విద్యార్థులు చేస్తున్న కృషి తమకెంతో నూతన ఉత్సాహానిస్తున్నదని ప్రధానోపాధ్యాయులు సిహెచ్. దేవ దత్తానంద్అన్నారు . ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠశాల బోధనా సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ డీఈవో గారి చేతుల మీదుగా సత్కరించడం జరిగింది. తరగతి గదిలోనే దేశ భవితవ్యం నిర్మితమవుతుందన్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ భావనతో తాము పూర్తిగా ఏకీభవిస్తామని, ఎందరో మహానుభావులను జాతికి అందించిన ఈ పాఠశాలలో మరింత విశిష్టమైన వ్యక్తులు తయారయ్యేలాగా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సంఘం అధ్యక్ష కార్యదర్శులు వి.జి కే మూర్తి, జామి భీమశంకర్ రావు విజ్ఞప్తి చేశారు .ఈ భావాన్ని వ్యక్తీకరించే ఒక గీతాన్ని సభలో వినిపించారు .పాఠశాల పూర్వ విద్యార్థులు వివిధ బ్యాచులకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉత్సాహంతో పాల్గొన్నారు .ఈ కార్యక్రమం గురజాడ దేశభక్తి గీతాన్ని సామూహికంగా ఆలపించడంతో ప్రారంభమై ,వందన సమర్పణతో ముగిసింది. సంఘం నాయకులు పేర్ల కామరాజు, పాలిశెట్టిమల్లిబాబు, ఢిల్లీ భాస్కరరావు, చెబోలు బాబ్జి, కె.ఫల్గుణరావు, కె.ఎల్.ఎన్. మూర్తి,,ఎం.శ్రీనివాసరావు
టి.బలమురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*