విశాఖపట్నం లో ప్రపంచస్థాయి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభము

9/6/2024 10:30:54 PM

 .కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 

విశాఖపట్నం: ఎక్స్ ప్రెస్ న్యూస్: 
 యూరప్‌లోని అతిపెద్ద హెల్త్‌కేర్ గ్రూపులలో ఒకటి గా ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తూ  అత్యంత గౌరవనీయమైన హెల్త్‌కేర్ బ్రాండ్ గా గుర్తింపు పొందటంతో పాటుగా 24 హాస్పిటల్స్ తో భారతదేశంలో ప్రముఖ హాస్పిటల్స్ చైన్ గా గుర్తింపు పొందిన మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు విశాఖపట్నం నగర వాసుల కోసం తమ క్యాన్సర్ సేవలను విస్తరించిందని కేంద్ర మంత్రి రామమోహన్ నాయుడు తెలిపారు . విశాఖపట్నంలో భారీ స్థాయిలో 100 పడకల ప్రపంచస్థాయి క్యాన్సర్ హాస్పిటల్ గా మెడికవర్ ఏర్పాటు చేయగా , కేంద్ర పౌర విమానయాన శాఖామాత్యులు  కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ఇది ప్రారంభమైనది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విశిష్ట అతిధిగా   వై. సత్య కుమార్ యాదవ్  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖామాత్యులు, మరియు   గొలగాని హరి వెంకట కుమారి  మేయరు - విశాఖపట్టణం, భరత్ మతుకుమిల్లి  ఎం పి - విశాఖపట్టణం,  వెలగపూడి రామకృష్ణ  ఎమ్మెల్యే - విశాఖపట్టణం  పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే - గాజువాక,  గంటా శ్రీనివాసరావు  ఎమ్మెల్యే - భీమిలి, ఎ. జి. వి. ఆర్ నాయుడు (గణబాబు)  ఎమ్మెల్యే - విశాఖపట్టణం  పంచకర్ల రమేష్ బాబు  ఎమ్మెల్యే - పెందుర్తి,  పెన్మెత్స విష్ణుకుమార్ రాజు  ఎమ్మెల్యే - విశాఖపట్టణం (ఉత్తరం),  సి హెచ్ వంశీ కృష్ణ శ్రీనివాస్  ఎమ్మెల్యే - విశాఖపట్టణం (దక్షిణం)  పాటుగా మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా  చైర్మన్ &  మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి అనిల్ కృష్ణ , మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు  డాక్టర్ ఏ శరత్ రెడ్డి , పి హరికృష్ణ , డాక్టర్ కృష్ణ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
 
రోగి కేంద్రీకృత ఆరోగ్య సంరక్షణ పరంగా అత్యున్నత ప్రమాణాలను అనుసరించే మెడికవర్  హాస్పిటల్ అందుబాటు ధరల్లో ఖచ్చితమైన చికిత్సను అందించటంలో దేశవ్యాప్తంగా తన ప్రత్యేకతను  నిలుపుకుంది. అత్యాధునిక సాంకేతికత తో అత్యున్నత నైపుణ్యం మిళితం చేసి ఇక్కడ అందించే వైద్య సేవలు ఎంతోమందికి నూతన జీవితాన్ని అందిస్తాయి. ఒకేచోట సమగ్రమైన ప్రపంచస్థాయి క్యాన్సర్ వైద్య సేవలను ఇది అందిస్తుంది. తమ హాస్పిటల్ ప్రారంభం గురించి మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా  చైర్మన్ &  మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి అనిల్ కృష్ణ మాట్లాడుతూ " భారత దేశం లో అగ్రగామి మల్టీనేషనల్ హాస్పిటల్ చైన్ గా ప్రస్తుతం 24 హాస్పిటల్స్ ని మేము నిర్వహిస్తుండటంతో పాటుగా ప్రతి సంవత్సరం లక్షలాదిమందికి  ఖచ్చితమైన వైద్య సేవలను అందిస్తున్నాము. అత్యంత నిష్ణాతులైన 40 మందికి పైగా డాక్టర్ల తో పాటుగా ప్రపంచస్థాయి సదుపాయాలు  ఇక్కడ అందుబాటులో ఉంటాయి అని అన్నారు. 

మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు  డాక్టర్ ఏ శరత్ రెడ్డి , పి హరికృష్ణ మాట్లాడుతూ "హెల్త్ సిటీ , ఆరిలోవ  విశాఖపట్నంలో 100 పడకల తో ఏర్పాటు చేసిన ఈ క్యాన్సర్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్స్ తో పాటుగా పెద్ద సంఖ్యలో ఐసియు బెడ్స్ కూడా వున్నాయి. ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు కలిగిన ఈ హాస్పిటల్ లో బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్, 4D పెట్-సిటి స్కాన్, ఎలెక్ట్రా వెర్సా hd రేడియేషన్ థెరపీ, ఇమేజ్ గైడెడ్ బ్రాక్ థెరపీ, రోబోటిక్ సర్జరీ సేవలతో  అత్యున్నత వైద్య సంరక్షణ అందించటం మా లక్ష్యం. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా తో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటక లలో కూడా మెడికవర్ కార్యకలాపాలు నిర్వహిస్తుందని త్వరలోనే మరిన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నాం " అని అన్నారు.

Name*
Email*
Comment*