తుఫాను పట్ల మత్యకారులు అప్రమత్తంగా ఉండాలి

9/6/2024 10:34:09 PM

*- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,

విజయనగరం- ఎక్స్ ప్రెస్ న్యూస్ :         
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు, చెక్ పోస్టు, రెడ్డి కంచేరు, చేవల కంచేరు, ముక్కాం గ్రామాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సెప్టెంబరు 6న సందర్శించారు. కేంద్ర విమానయానశాఖ మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన నాయుడు భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీసుశాఖ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఎయిర్ పోర్టు నిర్మాణ పనులను కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రివర్యులు పరిశీలించిన తరువాత జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి రెడ్డి కంచేరు గ్రామ సమీపంలోని ఎయిర్ పోర్టు చెక్ పోస్టును సందర్శించారు. చెక్ పోస్టు వద్ద భద్రత ఏర్పాట్లును నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పరిశీలించారు. రెడ్డి కంచేరు గ్రామాన్ని సందర్శించి, గ్రామంలో ప్రజలతో మమేకమై, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఎయిర్పోర్టు నిర్మాణ పనులకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వర్కర్లకు, గ్రామస్ధులకు వివాదాలు తలెత్తకుండా శాంతియుతంగా మెలగాలన్నారు. అనంతరం, చేపలకంచేరు, ముక్కాం గ్రామాలను జిల్లా ఎస్పీ సందర్శించి, గ్రామస్థులతో మమేకమయ్యారు. వాతావరణశాఖ తుఫాను హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళవద్దన్నారు. మత్స్యకారు యువతతో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మత్స్యకారుల జీవన విధానం, సముద్రంలోకి వేటకు వెళ్ళే సమయంలో ఏర్పడే ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మత్తు కలిగించే మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన జీవితాలపై ఛిద్రం అవుతాయని, తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని, వాటికి దూరంగా ఉండాలని కోరారు. సైబరు మోసాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని, మొబైల్స్కు వచ్చే లింకులపై క్లిక్  చేయవద్దని, ఓటిపి నంబర్లును ఇతరులతో షేర్ చేసుకోవద్దన్నారు. ఎటిఎంలను వినియోగించే సమయాల్లో పిన్ నంబరును ఇతరులకు చెప్పవద్దని, గుర్తు తెలియని వ్యక్తుల సహాయాన్ని ఎటిఎంల వినియోగించడంలో పొందవద్దన్నారు. సైబరు మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని మత్స్యకారులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ ఆర్. గోవిందరావు, ఎస్బీ సిఐ కే.కే.వి.విజయనాధ్, భోగాపురం సిఐ ఎన్.వి.ప్రభాకరరావు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, మత్యకారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*