- అప్పటికప్పుడు జేసీబీ రప్పించిన గంటా
పద్మనాభం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 9:
పాడుబడిన స్థితిలో ఉన్న పద్మనాభం మండలంలోని బుడ్డివలస స్కూల్ భవనాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముందు జాగ్రత్తగా దగ్గరుండి కూల్చివేయించారు. ఇక్కడ నడుస్తున్న ఎలిమెంటరీ స్కూల్ భవనం చాలాకాలంగా అవసాన దశలో ఉంది. గత రెండు రోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వల్ల మరింత ప్రమాదకరంగా తయారైంది. వర్ష ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం పద్మనాభం, భీమిలి, ఆనందపురం మండలాల్లో పర్యటించారు. కూలిపోయే స్థితిలో ఉన్న పాత స్కూల్ భవనాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న తరగతి గదిలో చదువుకుంటున్న విద్యార్థులు దీని వల్ల ప్రమాదం బారిన పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు జేసీబీని రప్పించి దగ్గరుండి పడగొట్టించారు. అనంతరం పాండ్రంగి బ్రిడ్జి, మహారాజు పేట ముంపు ప్రాంతాలను కూడా పరిశీలించారు. ఆ గ్రామంలో ఉన్న పెద్దలు నాయకులు అందరూ పాల్గొన్నారు.