ముంపు ప్రాంతాలను సందర్శించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే గణబాబు

9/9/2024 9:26:18 PM

ఎన్ఏడి: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 9: 
జీవీఎంసీ పశ్చిమనియోజకవర్గం 89, 90, 91వార్డ్ లో సోమవారం విశాఖ జిల్లా కలెక్టర్  విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ భారత్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే గణబాబు 91వార్డులో రామకృష్ణనగర్ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలను అదే విధంగా ముప్పువాటిల్లిన ప్రాంతాలను పరిశీలించారు. ఇందులో భాగంగా 90 వ వార్డ్ లక్మి నగర్ ఎఫ్ బ్లాక్ కొండ ప్రాంతంలో పాక్షికంగా దెబ్బతిన్న ప్రాంతాన్ని   హుటావుటిన చేరుకొని పరిశీలించరు. అదేవిధంగా గ్రామస్తులు తో మాట్లాడి వారికి ఏ సమస్యలు ఉన్న తక్షణమే చర్యలు చేపడతామని స్థానికులకు హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాలను అంచనా వేస్తూ రానున్న రోజుల్లో తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కొండవాలు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు కొద్దిపాటి వర్షాలు పడితే భయాందోళన చెందుతున్నామని చెప్పి వాపోయారు. అదే విధముగా అధికారి యంత్రంగానికి ఈ ప్రాంతంలో ఏవైతే పాక్షికంగా దెబ్బతిన్నాయో అధికారులకు సూచించారు. 89 వ వార్డు కొత్తపాలెం శివారు ప్రాంతాలలో భారీ వర్షాలకు కారణంగా దెబ్బతిన్న రహదారులను లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంత వాసులకు ఇటువంటి ఇబ్బందులు కలక్కుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రస్తుతానికి ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండాలని అన్నారు. కొంతమంది నిరాశ్రయులు ఎంపీపీ స్కూల్, లక్మి నగర్  ఆశ్రమం లో ఉంటున్న వారిని పరామర్శించి యోగక్షేమాలు ఏ విధంగా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.

Name*
Email*
Comment*