విజయవాడ వరద బాధితులకు వినోద్ నగర్ ఎస్ ఎల్ ఎఫ్ లు రూ.లక్ష విరాళం

9/9/2024 9:28:35 PM

ఎన్ఎడి: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 9: 
విజయవాడ వరద బాధితుల సహాయార్ధం వినోద్ నగర్ ఎస్ ఎల్ ఎఫ్ లు డ్వాక్రా మహిళలు రూ.లక్ష విరాళం అందజేశారు. ఈ మేరకు జీవీఎంసీ 90 వవార్డు పరిధి వినోద్ నగర్ ఆర్పీ సంధ్యారాణి నేతృత్వంలో విజయవాడ వరద బాధితుల నిమిత్తం డ్వాక్రా మహిళా సంఘాల నుంచి రూ.లక్ష నగదును విరాళాల రూపంలో సేకరించారు. సేకరించిన మొత్తాన్ని  90 వ వార్డు సీవో జగధాంబేశ్వరి ఆర్పీ ల సమక్షంలో  జోన్ 8 ఏ.పి.డి శ్రీరామ్ కు రూ.లక్ష చెక్కును సోమవారం అందజేశారు. మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన ఎస్ హెచ్ జి సభ్యులను సహకరించిన ప్రతి ఒక్కరికి ఆర్ పి సంధ్యారాణి ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కె.  అనంతలక్ష్మి, కాకాని నగర్ మహిళా నాయకురాలు లలిత కుమారి, ఆర్పీ లు తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*