ఎన్ఏడి: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 9:
జీవీఎంసీ 90 వ వార్డు లక్ష్మీ నగర్ ఎఫ్ బ్లాక్ సేవియర్ లూథరన్ చర్చ్ 34 వ వార్షికోత్సవ వేడుకలను ఉజ్జీవసువార్త సభలను సంఘ ఫేరీష్ పాస్టర్ రెవరెండ్ లంకపల్లి జాకబ్ రాజు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వాక్యోపదే కులు గేయ రచయిత రెవరెండ్ డాక్టర్ శ్యామ్.జె.వేదాల హాజరై సంఘ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంఘం ను ఉద్దేశించి ప్రసంగించారు. సండే స్కూల్ పిల్లలు,యూత్ సభ్యులు, మహిళలు, ప్రత్యేక గీతాలు ఆలపించారు. బైబిల్ పఠనం చేశారు. అనంతరం ముఖ్య అతిథి శ్యామ్.జె.వేదాల ను డెలిగేట్ ఆల్టర్నేటివ్ డెలిగేట్స్, పీసీసీ మెంబర్స్ ట్రెజరర్ సంఘ సభ్యులు శాలువా కప్పి సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా పాస్టర్ జాకబ్ రాజు సంఘం దినదినాభివృద్ధి చెందడానికి సహకరించిన తోడ్పాటు అందించిన పెద్దలు సంఘ సభ్యుల సేవలను కొనియాడి అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ నేతల శేఖర్, డెలిగేట్, రవీంద్రనాథ్ డానియల్ ఆల్టర్నేటివ్ డెలిగేట్ లూథర్ పాల్, పిసిసి మెంబర్స్ కె. జాన్ సుధాకర్, ఎస్పీ ప్రసన్నకుమార్, కొండా విజయ్ కుమార్, జి. షాలెంరాజు, కోనాల కరుణ్ కుమార్, యూత్ సభ్యులు, స్త్రీల సమాజం, సండే స్కూల్ పిల్లలు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.