బొమ్మిడి రమణ ను పరామర్శించిన ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే గణబాబు

9/9/2024 9:33:36 PM

ఎన్ఏడి: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 9:
జీవీఎంసీ 90 వార్డు కార్పొరేటర్  బొమ్మిడి రమణ  తండ్రి  బొమ్మిడి అప్పలనాయుడు  మృతి చెందారు. ఈ మేరకు బుచ్చిరాజుపాలెం జీవీఎంసీ స్కూల్  దగ్గర లో గల స్వగృహం నందు ఆయన భౌతికకాయాన్ని సందర్శనార్ధం ఉంచారు. విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం. శ్రీ భరత్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పి. గణబాబు విశాఖ జిల్లా ఆర్డిఓ హుస్సేన్ సాహెబ్, విశాఖ డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్  సందర్శించి కుటుంబ సభ్యులు పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. బొమ్మిడి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. అదేవిధంగా జీవీఎంసీ కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, పల్ల శ్రీనివాసరావు, దాడి వెంకట రమేష్, గళ్ళా చిన్న, సరగడం రాజశేఖర్, బల్ల శ్రీనివాసరావు, గొలగాన పోలవరం, రాపర్తి కన్నా, సేనాపతి శంకరరావు, మొల్లి లక్ష్మణరావు, పిల్ల వెంకట్రావు ,మద్దెల రాజశేఖర్, స్థానిక వార్డు అధ్యక్షులు ఎలమంచిలి ప్రసాద్, విశాఖ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నరవ పైడిరాజు, న్యాయవాది చెవ్వేటి జీవన్ కుమార్, పిల్లల మాణిక్యం, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*