లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వారికి..డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలికంగా రద్దు

9/9/2024 9:37:55 PM

ఎన్ఏడి: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 9: 
హెల్మెట్ ధరిం చని 1199 మంది వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సుల ను తాత్కాలికంగా మూడు నెలల పాటు రద్దు చేసినట్టు డీటీసీ రాజారత్నం తెలిపారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడుపుతున్న, వెనుక కూర్చున్న వ్యక్తులప కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. కేసులు నమోదు చేసిన వాటిలో 1199 మంది డ్రైవింగ్ లైసెన్సులను మూడు నెలల పాటు సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఈనెల 1 నుంచి 5వ తేదీ వరకు మొత్తం 2325 మందిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. వాటిలో 1199 మంది డ్రైవింగ్ లైసెన్సు లను తాత్కాలికంగా రద్దు చేసినట్టు వివరించారు. తమ తనిఖీ లు ఇంకా కొనసాగిస్తామని డీటీసీ రాజారత్నం తెలిపారు.

Name*
Email*
Comment*